Breaking News

సీఎం రేవంత్‌ ఓఎస్డీనంటూ బెదిరింపులు.. మాజీ క్రికెటర్‌ అరెస్ట్‌

Published on Thu, 05/22/2025 - 21:24

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి ఓఎస్డీ పేరుతో బెదిరింపులకు దిగుతున్న శ్రీకాకుళానికి చెందిన ఆంధ్రా మాజీ రంజీ క్రికెటర్‌ బుడుమూరు నాగరాజును హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం యవ్వారిపేటకు చెందిన నాగరాజు ర్యాపిడో, కంట్రీ డిలైట్‌ ఎండీలకు ఫోన్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తాను సీఎం ఓఎస్డీ అని చెప్పుకొంటూ పలు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల ఛైర్మన్‌లకు వాట్సాప్‌ మెసేజ్‌లు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఓఎస్డీ పేరుతో నాగరాజు ఫేక్‌ ఈ మెయిల్‌ క్రియేట్‌ చేసినట్టు పోలీసులు నిర్థారించారు. నాగరాజును శ్రీకాకుళంలోఅదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్టు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాజీ క్రికెటర్ నాగరాజుపై 30 కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళంలో నాగరాజును అరెస్ట్ చేసిన పోలీసులు.. హైదరాబాద్‌కు తరలించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)