Breaking News

5న విచారణకు కేసీఆర్‌

Published on Wed, 05/28/2025 - 01:25

సాక్షి, హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు జూన్‌ 5న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎదుట హాజరుకానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని అనుమా నిస్తున్న ప్రభుత్వం, వాటిపై విచారణకు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ను నియమించిన విషయం విదితమే. కాగా ఇప్పటికే పలువురు అధికారులను, కాంట్రాక్టు సంస్థలను కమిషన్‌ విచారించింది. తాజాగా ఈ నెల 20న కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు నోటీసులు జారీ చేసింది. జూన్‌ 5న కేసీఆర్, 6న ఈటల, 9న హరీశ్‌రావు తమ ముందు హాజరు కావాలని సూచించింది. 

సమగ్ర నివేదికతో సిద్ధం!
కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తూ గత ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర పూరితంగా కమిషన్‌ను ఏర్పాటు చేసిందని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తూ వస్తోంది. తాజాగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేననే వాదన స్వయంగా వినిపించాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులు మొదలుకుని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వరకు ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు, పనులు, వెచ్చించిన నిధులు, సమకూరిన ప్రయోజనం తదితర అంశాలన్నింటినీ కమిషన్‌ ముందు పెట్టేందుకు కేసీఆర్‌ సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. 

ఈ మేరకు ఒక వివరణాత్మక నివేదికను కూడా కేసీఆర్‌ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు లేకుండానే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పనులు ప్రారంభించడం, మహారాష్ట్రతో ఒప్పందం లేకుండా ప్రాజెక్టును ప్రకటించడం, కాంట్రాక్టు సంస్థలకు మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ఇచ్చిన వైనాన్ని కూడా కమిషన్‌ ముందు పెట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలిసింది. 

కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు చేసిన వారికి.. ఆధారాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ కమిషన్‌ ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదనే అంశాన్ని కూడా కేసీఆర్‌ లేవనెత్తే అవకాశముందని తెలుస్తోంది. మేడిగడ్డ బరాజ్‌ కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగం కాగా, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదంటూ ప్రభుత్వం చేస్తున్న వాదనలపైనా కేసీఆర్‌ కమిషన్‌కు వివరణ ఇస్తారని బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. కమిషన్‌ విచారణకు హాజరుకానున్నట్టు ఈటల రాజేందర్‌ ఇప్పటికే ప్రకటించగా, కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా  హరీశ్‌రావు విచారణకు హాజరుపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

యూకే, అమెరికా పర్యటనకు కేటీఆర్‌
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు మంగళవారం ఉదయం యూకే, అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కేటీఆర్‌ ఈ నెల 30న యూకేలోని వార్విక్‌ యూనివర్సిటీ సైన్స్‌ పార్క్‌లోని రీసెర్చ్‌ సెంటర్‌లో ప్రాగ్మాటిక్‌ డిజైన్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ సంస్థ కొత్త నాలెడ్జ్‌ పార్క్‌ను ఆవిష్కరిస్తారు. లండన్‌లో జరిగే ఇతర కీలక కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంటారు. అనంతరం అమెరికాకు చేరుకుని జూన్‌ 1న డల్లాస్‌లో జరిగే పార్టీ రజతోత్సవ సభ, 2న జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొంటారు. 

జూన్‌ 6న తిరిగి హైదరాబాద్‌కు చేరుకోవాల్సి ఉండగా, కేసీఆర్‌ కాళేశ్వరం కమిషన్‌ ఎదుట హాజరు కావాలనుకుంటున్న నేపథ్యంలో జూన్‌ 4నే ఆయన నగరానికి వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా తాను అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని తెలుపుతూ ఆయన ఏసీబీకి లేఖ రాశారు. జూన్‌ రెండో వారంలో కేటీఆర్‌ విచారణకు హాజరయ్యే అవకాశముంది.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)