Breaking News

హైదరాబాద్‌లో భూదందా.. 100 గజాల స్థలం రూ. 40 వేలే

Published on Sun, 01/26/2025 - 14:15

హైదరాబాద్‌,సాక్షి: హైదరాబాద్‌లో ఘరనా మోసం వెలుగులోకి వచ్చింది. రూ.10వేలకే వంద గజాలంటూ ఇద్దరు వ్యక్తులు వందల మందిని నమ్మించారు. వందల కోట్లు సంపాదించారు. అపై నట్టేటా ముంచేశారు. 

వనస్థలీపురం పీఎస్‌ పరిధిలోని హరిణి వనస్థలీ నేషనల్‌ పార్క్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అటవీ,పోలీస్‌ శాఖ ఆధీనంలో ఆటోనగర్‌ పరిసర ప్రాంతాలు ఉన్నాయి. అయితే, మన్సూరాబాద్‌ సర్వే నెంబర్‌ ఏడులో ఉన్న 682 ఎకరాల ఫారెస్ట్‌ ల్యాండ్‌ తన తల్లిపేరు మీద ఉందని చెప్పి 50వేల మందికి నోటరీ చేశారు యూసఫ్‌ ఖాన్‌ అనే వ్యక్తి. అతని భార్య తులసమ్మలు. ఈ రోజు నోటరీ చేసిన బాధితులకు ప్లాట్లు ఇస్తానని చెప్పడంతో భారీ సంఖ్యలో బాధితులు చేరుకున్నారు. బాధితుల రాకతో అప్రమత్తమైన పోలీసులు సుమారు 500 మందికి పైగా అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు.   

అయితే బాధితుల్ని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు ముఠాగా ఏర్పడి 587 ఎకరాల ఫారెస్ట్ భూమిని ప్లాట్లుగా చేసి అమ్మారు. 100 గజాలు రూ. 40-50వేల రూపాయలకే ముఠా అమ్మగా.. ఆ భూమిని సుమారు 50 వేల మంది కొనుగోలు చేసినట్లు అధికారులు నిర్ధారించారు.  

భూదందాను అడ్వకేట్ షేక్ జిలానీ ద్వారా యూసఫ్ ఖాన్ ,తులసమ్మలు తతంగం నడిపించారు. అయితే, ఇవాళ కొన్నవాళ్లకు ఫ్లాట్స్ ఇస్తానని చెప్పి సర్వే నెంబర్ 7 దగ్గరకు రావాలని అడ్వకేట్ జిలానీ కొనుగోలు దారుల్ని నమ్మించారు. ల్యాండ్‌ మాఫియా మోసంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఫారెస్ట్ భూమి చుట్టూ మోహరించారు.

ప్లాట్లను సొంతం చేసుకునేందుకు కొనుగోలు దారులు సర్వే నెంబర్‌ ఏడు వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించడంతో అనుమానం వ్యక్తం చేసిన కొనుగోలు దారులు అసలు విషయం తెలిసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.  కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)