Breaking News

ఫుడ్‌ వేస్ట్‌.. టన్నుల్‌ టన్నుల్‌!

Published on Thu, 10/29/2026 - 14:04

ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే, మరోవైపు టన్నుల కొద్దీ ఆహారాన్ని వృథా చేయడం పర్యావరణానికే కాక మానవత్వానికే పెద్ద ముప్పుగా పరిణమించింది. ప్రపంచవ్యాప్తంగా ఆహార వృథా అనేది ఓ తీవ్రమైన సమస్యగా మారింది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) నివేదికల ప్రకారం చూస్తే మొత్తం ఆహార వృథా పరిమాణం పరంగా చైనా ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక భారతదేశం రెండో స్థానంలో ఉంది.

అయితే, ఒక్కో వ్యక్తి చేసే సగటు వృథా (పర్‌ కేపిటా వేస్ట్‌) పరంగా చూస్తే మాల్దీవుల ప్రజలు ప్రపంచంలోనే అత్యధికంగా ఆహారాన్ని వృథా చేస్తున్నారు. ఇదిలా ఉంటే దక్షిణ కొరియా మోడల్‌ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ దేశం ఆహార వ్యర్థాలను ల్యాండ్‌ఫిల్స్‌లో వేయడాన్ని నిషేధించింది. అక్కడ వ్యర్థాల బరువును బట్టి ప్రజలపై పన్ను వేసే ‘పే యాజ్‌ యూ త్రో’విధానాన్ని అమలు చేసి 98% ఆహార వ్యర్థాలను రీసైకిల్‌ చేస్తోంది. - సాక్షి, హైదరాబాద్‌

ఏటా ఆహార వృథాలో అగ్రస్థానంలో ఉన్న దేశాలు

  • చైనా సుమారు 10.87 కోట్ల టన్నులు

  • భారత్‌ సుమారు 7.81 కోట్ల టన్నులు

  • అమెరికా సుమారు 2.47 కోట్ల టన్నులు

తలసరి వృథా ఆధారంగా

  • మాల్దీవులు: ఇక్కడ ఒక్కో వ్యక్తి ఏడాదికి సుమారు 260 కిలోల ఆహారం (ప్రపంచ సగటు కంటే ఇది రెట్టింపు).

  • సిరియా, డొమినికన్‌ రిపబ్లిక్‌ : ఇక్కడ తలసరి వృథా 210 కిలోల కంటే ఎక్కువ.

  • ఇండియా : సగటున ఒక వ్యక్తి ఏడాదికి 55 కిలోల ఆహారాన్ని పారేస్తున్నాడు.

వృథాను తగ్గించడం ఎలా?

  • ఆహార వృథాను అరికట్టడానికి వ్యక్తిగత స్థాయి నుంచి ప్రభుత్వ స్థాయి వరకు ఉమ్మడి బాధ్యత వహించాలి.

  • గృహ/వ్యక్తిగత స్థాయిలో వారం మొత్తానికి కావలసిన వస్తువుల జాబితా ముందే సిద్ధం చేసుకుని అవసరమైనంత వరకే కొనాలి.

  • పండ్లు, కూరగాయలు త్వరగా కుళ్ళిపోకుండా ఫ్రిజ్‌లో సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి.

  • రాత్రి మిగిలిపోయిన అన్నం లేదా కూరలను మరుసటి రోజు ఉదయం ఇతర వంటకాల్లో ఉపయోగించుకోవచ్చు.

  • హోటళ్లు, ఫంక్షన్లలో ప్లేట్‌ నిండా వడ్డించుకోకుండా, కావలసినంత మాత్రమే తక్కువ పరిమాణంలో చిన్న ప్లేట్లలో వడ్డించుకోవాలి. 

  • పెళ్లిళ్లు, పార్టీలలో మిగిలిన మంచి ఆహారాన్ని వృథా చేయకుండా అనాథ శరణాలయాలకు లేదా ‘నో ఫుడ్‌వేస్ట్‌’వంటి స్వచ్ఛంద సంస్థలకు అందించాలి.

  • తినడానికి వీలుకాని ఆహార వ్యర్థాలను (ఉదాహరణకు కూరగాయల తొక్కలు) పారేయకుండా సేంద్రియ ఎరువుగా మార్చాలి. 

  • ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లో కోల్డ్‌ స్టోరేజ్‌ కేంద్రాలను పెంచడం ద్వారా పంట నష్టాన్ని నివారించవచ్చు.

ఆహార వృథాకు ప్రధాన కారణాలు..

  • భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆహార వృథా వెనుక వేర్వేరు కారణాలు ఉన్నాయి. సరైన కోల్డ్‌ స్టోరేజీ సౌకర్యాలు లేకపోవడం, రవాణా లోపాలు, పంట పండిన తర్వాత మార్కెట్‌కు చేరేలోపే పాడైపోవడం, శుభకార్యాలు, పెళ్లిళ్లు, పండుగలు, హోటళ్లలో మిగిలిన ఆహారాన్ని పారేయడం.. ఇలాంటి కారణాలతో వృథా అవుతోంది.

  • అమెరికా, యూరప్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వినియోగదారుల ప్రవర్తన, అవసరానికి మించి ఎక్కువగా కొనుగోలు చేయడం, సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, చూడడానికి అందంగా లేని పండ్లు, కూరగాయలను సూపర్‌ మార్కెట్ల తిరస్కరణ, ఎక్స్‌పైరీ డేట్స్, ‘బెస్ట్‌ బి ఫోర్‌’తేదీలు దాటగానే ఆహారం బాగున్నా పారేయడం వంటి కారణాలతో వృథా జరుగుతోంది.

వృథాను అరికడుతున్న ఎన్జీవోలు

నో ఫుడ్‌ వేస్ట్‌ : ఇది దక్షిణ భారతంలో అత్యంత క్రియాశీలకంగా పనిచేస్తున్న సంస్థ. వివాహాలు, శుభకార్యాల్లో మిగిలిన ఆహారాన్ని సేకరించడానికి వీరు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్లను నడుపుతున్నారు. సేకరించిన ఆహార నాణ్యతను తనిఖీ చేసి, ఆకలితో ఉన్నవారికి అందిస్తున్నారు.

ఫీడింగ్‌ ఇండియా : జొమాటో ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ దేశవ్యాప్తంగా వందలాది నగరాల్లో విస్తరించి ఉంది. ‘హంగర్‌ హీరోస్‌’అని పిలిచే వీరి వాలంటీర్లు హోటళ్లు, క్యాటరర్ల నుంచి మిగిలిపోయిన మంచి ఆహారాన్ని సేకరించి మురికివాడలు, అనాథ శరణాలయాల్లో పంపిణీ చేస్తున్నారు.

రాబిన్‌ హుడ్‌ ఆర్మీ : ఇది పూర్తిగా యువ వాలంటీర్లతో నడిచే లాభాపేక్ష లేని సంస్థ. వీరు ఎలాంటి విరాళాలు తీసుకోరు. కేవలం రెస్టారెంట్లు, స్థానిక గృహాల నుంచి మిగిలిన లేదా అదనపు ఆహారాన్ని సేకరించి, నిరాశ్రయులకు పంచుతున్నారు.

ఇండియా ఫుడ్‌ బ్యాంకింగ్‌ నెట్‌వర్క్‌ : వీరు ప్రభుత్వేతర సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలను అనుసంధానిస్తూ, ఆహార సరఫరా వ్యవస్థలో వృథాను తగ్గించడానికి జాతీయ స్థాయిలో పనిచేస్తున్నారు.

ఇదీ చదవండి: కొత్త రుచులు వద్దమ్మా..

Videos

నా పెళ్లి గురించి మీకెందుకు? KTR పై బల్మూరి వెంకట్ భార్య ఫైర్

కాస్కోండి ఒక్కొక్కడికి ప్యాంట్ తడిచిపోకపోతే.. రోజా నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

భాగ్యలక్ష్మి పై ట్రోల్స్ చేయడం కాదు.. దమ్ముంటే..!

హీరోగా వంగా ఇక స్క్రీన్ పై అరాచకమే

పబ్లిసిటీ ఆపి.. రైతులను ఆదుకో చంద్రబాబుకు కన్నబాబు డిమాండ్స్

దొంగ సంతకాలతో విత్ డ్రా చేశారు... మంత్రి ఆనంపై సంచలన వ్యాఖ్యలు

నగరిలో దుమ్మురేపిన రోజా ఎన్నికల ప్రచారంలో

జార్ఖండ్ ను అంటుకున్న అర్నబ్ తుఫాన్

DIWALI GIFT! ఒక రోజు ముందే రిలీజ్

ఓట్లు అంటే చెప్పు తీసి కొడతా..! టీడీపీ నేతలను పరిగెత్తించిన ప్రజలు

Photos

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబై : 'ELLE ఇండియా బ్యూటీ అవార్డ్స్ 2026' (ఫోటోలు)

+5

150 కిలోమీటర్ల ప్రచండ గాలులు... అర్నబ్ తుపాను బీభత్సం (ఫోటోలు)

+5

హైదరాబాద్ : హెబ్బా.. హోయ్‌రబ్బా! (ఫోటోలు)

+5

అర్నబ్ తుపాను విధ్వంసం.. కోనసీమ జిల్లా అతలాకుతలం (ఫోటోలు)

+5

‘KilleR’ సినిమా 1 కోటి రూపాయల కాంటెస్ట్ ప్రెస్‌మీట్ (ఫోటోలు)

+5

‘దొంగ నా కొడుకు’ మూవీ సాంగ్ లాంచ్ (ఫోటోలు)

+5

స్టాక్‌ మార్కెట్‌లోకి జియో.. అంబానీ కుటుంబంలో వెల్లివిరిసిన ఆనందాలు (ఫోటోలు)

+5

ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన హీరోయిన్ నివేదా పేతురాజ్ (ఫోటోలు)