Breaking News

కేంద్ర కేబినెట్‌తో ‘విమానం’ మోత!

Published on Tue, 06/11/2024 - 06:40

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల ప్రమాణస్వీకారానికి అన్ని రాష్ట్రాల నుంచి నేతలు, కార్యకర్తలు ఢిల్లీకి తరలివెళ్లారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ఎంపీలకు కేబినెట్‌లో చోటు దక్క­డంతో.. వారి అనుచరులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలోనే హస్తినకు పయనమయ్యా­రు. ఇంతవరకు బాగానే ఉన్నా వారంతా తిరిగిరావడానికి మాత్రం ఇక్కట్లు మొదలయ్యాయి. విమానాలకు విపరీతంగా డిమాండ్‌ పెరగడంతో.. ఎయిర్‌లైన్స్‌ సంస్థలు చార్జీలను రెండు, మూడింతలు పెంచేశాయి. మరోవైపు రైళ్లలోనూ విపరీతంగా వెయిటింగ్‌ లిస్టులతో సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. 

ఎక్కడికి వెళ్లాలన్నా.. 
తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వెళ్లేప్పుడు రూ.10– 12 వేలు టికెట్‌ ధర ఉండగా.. తిరిగి వచ్చేందుకోసం టికెట్ల ధరలు రూ.25 వేల నుంచి రూ.45 వేల వరకు టికెట్‌ చార్జీలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ (గన్నవరం), రేణిగుంట (తిరుపతి), విశాఖపట్నం, రాజమహేంద్రవరం ఇలా ఎక్కడికైనా ఇదే పరిస్థితి. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు దాదాపు 20కిపైగా విమాన సర్వీసులు.. విజయవాడ, రేణిగుంట(తిరుపతి), విశాఖపట్నం, రాజమహేంద్రవరంలకు రెండు, మూడు చొప్పున సర్వీసులు ఉన్నాయి. ఒకట్రెండ్‌ స్టాప్‌లతో మరో పది వరకు సర్వీసులు ఉన్నాయి. వీటన్నింటిలోనూ చార్జీలు పెరిగిపోయాయి. 

రైళ్లలో సీట్ల కోసం ‘ఈక్యూ’రిక్వెస్టులు 
విమాన టికెట్‌ భారం ఎక్కువైందని భావించేవారు, టికెట్‌ దొరకనివారు.. రైళ్లలో తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ సికింద్రాబాద్, విజయవాడ ప్రాంతాలకు ఉన్న ఏడెనిమిది రైలు సరీ్వసుల్లో స్లీపర్‌క్లాస్‌లో భారీగా వెయిటింగ్‌ లిస్టులు ఉంటే.. ఏసీ కోచ్‌లలో సీట్లు అందుబాటులోనే లేవని చూపిస్తోంది. దీంతో రైలు టికెట్‌ కన్‌ఫర్మేషన్‌ కోసం ఈక్యూ (ఎమర్జెన్సీ కోటా) లెటర్‌ ఇవ్వాలంటూ ఎంపీలను కోరుతున్నారు. అయినా సీట్లు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. సోమవారం ఉదయం వెళ్లాల్సినవారు శనివారమే ఈక్యూ లెటర్‌ ఇచి్చనా.. టికెట్లు కన్‌ఫర్మ్‌ కాక ఢిల్లీలోనే ఆగిపోయారు.   

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)