Breaking News

అన్ని బస్సుల్లోనూ అగ్నిమాపక పరికరాలు

Published on Tue, 10/28/2025 - 01:20

సాక్షి, హైదరాబాద్‌: ఏపీలో తాజాగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుకు మంటలంటుకొని 19 మంది సజీవదహనమైన నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ అప్రమత్తమైంది. ఈ తరహా ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు ప్రయా ణికులు వీలైనంత వేగంగా తప్పించుకునేలా వారిలో అవగాహన కల్పించే ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రయాణికులకు వివరించాలని డ్రైవర్లకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది. మంగళవారం నుంచి ఈ ప్రక్రియ అమలు కానుంది. అలాగే పల్లె వెలుగు సహా అన్ని రకాల బస్సుల్లో అగ్నిమాపక పరికరా లను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.

ఎయిర్‌ హోస్టెస్‌ తరహాలో...: విమానం బయలుదేరే ముందు ఎయిర్‌ హోస్టెస్‌ ప్రయాణికులను విధిగా అప్రమత్తం చేస్తారు. విమానంలోని అత్యవసర మార్గాలు, ఆక్సిజన్‌ మాస్కులను ధరించాల్సిన విధానం, లైఫ్‌ జాకెట్‌ పొందే తీరు, అందులో గాలి నింపే పద్ధతి.. ఇలా అన్ని అంశాలనూ ప్రయాణికులకు వివరిస్తారు. ఇదే తరహాలో ఇకపై బస్సు డ్రైవర్లు కూడా ప్రారంభ స్టేషన్‌లో ప్రయాణికులకు కొన్ని సూచనలు చేయనున్నారు. తొలుత తనను తాను పరిచయం చేసుకొని ఆపై కండక్టర్‌ పేరు వెల్లడిస్తారు. అలాగే బస్సు ఎప్పుడు బయలుదేరి తుది గమ్యం ఏ వేళకు చేరుకుంటుందో వివరిస్తారు. 

బస్సులో అగ్నిమాపక పరికరాలను ఉంచిన ప్రదేశం.. వాటిని వాడే విధానం..  అత్యవసర తలుపు ఉండే చోటు.. దాన్ని తెరిచే పద్ధతి.. అత్యవసర సమయంలో కిటికీ అద్దాలను పగలగొట్టేందుకు వాడే సుత్తిని ఎలా వాడాలో, దాన్ని బస్సులో ఎక్కడ ఉంచారో వెల్లడిస్తారు. ఏసీ బస్సుల్లో రూఫ్‌ హాచెస్‌ తెరిస్తే పొగ బయటకు వెళ్లిపోతుందని, అత్యవసర సమయాల్లో వాటి నుంచి కూడా ప్రయాణికులు బయటపడే వీలుంటందని కూడా వివరించనున్నారు. మరోవైపు ప్రస్తుతం ఏసీ బస్సుల్లోనే సుత్తులు ఉంటుండగా ఇటీవల కొన్ని సూపర్‌ లగ్జరీ బస్సుల్లోనూ అందుబాటులో ఉంచుతున్నారు. ఇక నుంచి ఏసీ సహా అన్ని సూపర్‌ లగ్జరీ బస్సుల్లో కూడా సుత్తులు, అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచనున్నారు.  

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)