Hyderabad: క్రాకర్స్‌ షాపులో అగ్ని ప్రమాదం

Published on Mon, 10/28/2024 - 08:45

సుల్తాన్‌బజార్‌: బొగ్గులకుంటలోని పరస్‌ ఫైర్‌వర్క్స్‌ దుకాణంలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. గౌలిగూడ నుంచి నాలుగు ఫైర్‌ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. క్రాకర్స్‌కు నిప్పు అంటుకుని భారీ శబ్దాలు రావడం, మంటలు ఎగిసిపడటంతో చుట్టు పక్కల ఉన్నవాళ్లు భయాందోళనతో పరుగులు తీశారు. 

దట్టమైన పొగతో అస్వస్థతకు గురైన ఇద్దరు మహిళలను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు బొగ్గులకుంట చౌరస్తా నుంచి కోఠి బ్యాంక్‌ స్ట్రీట్‌ వైపు ట్రాఫిక్‌ను మళ్లించారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. అగ్ని ప్రమాదానికి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూటా? లేక మానవ తప్పిదమా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. దు కాణం పక్కన ఉన్న బిల్డింగ్‌కు కూడా మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్న తాజా టిఫిన్‌ సెంటర్‌కు సైతం మంటలు వ్యాపించాయి. గౌలిగూడ ఫైర్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌కుమార్‌ నేతృత్వంలోని అగి్నమాపక బృందం మంటలను ఆరి్పంది. క్రాకర్స్‌ కొనుగులుదారుల వాహనాలు కూడా అగ్నికి ఆహుతి కావడం ఆందోళనకు కలిగిస్తోంది.  

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)