Breaking News

రెండ్రోజుల క్రితమే గృహ ప్రవేశం.. అంతలోనే అగ్ని ప్రమాదం

Published on Thu, 11/28/2024 - 19:48

రెండ్రోజుల క్రితం ఆనందంగా బంధు మిత్రులను పిలుచుకుని గృహ ప్రవేశం చేశారు. సొంతింటి కల నెరవేరిందని సంబరపడ్డారు. అంతలోనే కలల సౌధం కాలిపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. హైదరాబాద్‌ మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. పుప్పాలగూడలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఈఐపీఎల్‌ కార్నర్‌స్టోన్‌ గేటెడ్‌ కమ్యూనిటీలోకి కొందరు చేరుతున్నారు. అందులోని 8వ అంతస్తు 804 ఫ్లాట్‌ను ఐటీ ఉద్యోగి సంతోష్‌ కొనుగోలు చేశారు.

రెండు నెలలుగా ఇంటిరీయర్‌ పనులు చేయించారు. సోమవారం గృహ ప్రవేశం చేశారు. మూడు రోజుల పాటు కొత్త ఫ్లాట్‌లోనే నిద్ర చేశాక పూర్తి స్థాయిలో సామాన్లతో ఇక్కడకు వచ్చే ఆలోచనలో ఉన్నారు. కిచెన్‌లో పూజ చేసి వెలిగించిన దీపం బుధవారం దాని కింద ఉన్న దుస్తులకు అంటుకుంది. ఇది గమనించిన కుటుంబీకులు దీపాన్ని ఆర్పకుండా భయంతో బయటికి పరుగులు తీశారు. దీంతో మంటలు వ్యాపించడంతో ఫ్లాట్‌ మొత్తం కాలిపోయింది.  

మంటలను ఆర్పిన సిబ్బంది... 
కిచెన్‌లో మొదలైన మంటలను చూసి బయటకు పరుగులు తీసిన ఇంటి యజమాని, బంధువులు మెయింటెనెన్స్‌ వారికి అగ్ని ప్రమాదం విషయం చెప్పారు. సెక్యూరిటీ, మెయింటెనెన్స్‌ సిబ్బంది వెంటనే నీటిని చల్లి మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఫ్లాట్‌ మొత్తం వుడ్‌ వర్క్‌తో పాటు కాలి బూడిదయ్యింది. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మరోసారి నీటిని చల్లారు. 

చ‌ద‌వండి: సరోగసీ కోసం వచ్చి.. ఆపై పారిపోదామనుకొని..

పది రోజుల క్రితం పక్క గేటెడ్‌ కమ్యూనిటీలోని ఓ ఫ్లాట్‌లో ఇదే మాదిరిగా అగ్ని ప్రమాదం జరగటంతో ఇందులోని నివాసితులకు అలాంటి పరిస్థితి ఎదురయినపుడు మంటలను ఎలా ఆర్పాలి? ఫైర్‌ గ్యాస్‌ను ఎలా ఉపయోగించాలి? నీటి లభ్యత ప్రతి ఫ్లాట్‌కు ఎలా వస్తుంది? అనే విషయంలో మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. అయినా బుధవారం వాటిని పట్టించుకోకపోవటంతో ప్రమాదం సంభవించిందని మెయింటెనెన్స్‌ ఇన్‌చార్జి గిరి తెలిపారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)