Breaking News

అన్నా డబ్బులున్నయా.. వడ్డీ ఎంతైనా ఓకే!

Published on Sat, 11/29/2025 - 12:19

రంగారెడ్డి జిల్లా: ‘అన్నా.. సర్పంచ్‌ రిజర్వేషన్‌ కలిసొచ్చింది.. ఏమైనా డబ్బులున్నయా.. రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు చూడు అత్యవసరమన్నా.. నేను గెలిస్తే నీవు గెలిచినట్లే’ అని పంచాయతీ పోటీదారులు అప్పుల కోసం ఆరాటపడుతున్నారు. ఇందుకోసం వ్యవసాయ భూమి, లేదా ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ముందుకు వస్తున్నారు. వచ్చే నెల 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించిన నేపథ్యంలో నగదు సమకూర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. జిల్లాలోని 526, 4,668 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం సర్పంచ్‌లుగా పోటీ చేస్తున్న వారిలో చాలా వరకు స్థానికంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవారే. రెండేళ్లుగా బిజినెస్‌ లేకపోవడంతో కొంత డీలా పడ్డారు. ఈక్రమంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన పంచాయతీ ఎన్నికలు రానే వచ్చాయి.

పదవులకు భలే డిమాండ్‌
మహానగరం చుట్టూ విస్తరించి ఉన్న పలు మండలాల్లోని గ్రామాల్లో సర్పంచ్‌ పదవులకు భలే డిమాండ్‌ ఉంది. వెంచర్ల ఏర్పాటు, ఇళ్ల నిర్మాణం, పరిశ్రమల కోసం పంచాయతీల అనుమతులు ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో సర్పంచ్‌లుగా గెలిచిన వారికి ఎంతో కొంత ఆదాయానికి అవకాశం ఉంటుంది. దీంతో ఎన్ని డబ్బులైనా ఖర్చు చేసి, సర్పంచ్‌గా గెలవాల్సిందేనని ఆశావహులు పట్టుదలతో ఉన్నారు. వెయ్యి మంది నుంచి 2,500 మంది ఓటర్లకు పైగా ఉన్న గ్రామాల్లో సర్పంచ్‌గా పోటీ చేసేందుకు కనీసం రూ.50 లక్షల నుంచి కోటి వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది. పోటీ చేసే వ్యక్తికి మంచి పేరున్నా.. ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా ఎన్నికల సమయంలో పెద్ద మొత్తం డబ్బు ఖర్చు చేయనిదే గెలిచే పరిస్థితి ఉండదు. అందుకే పోటీదారులంతా అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఐదు రూపాయల వడ్డీ అయినా సరే అప్పు తీసుకునేందుకు వెనకాడటం లేదు. ఇదే అదనుగా భావిస్తున్న వడ్డీ వ్యాపారులు ముందు జాగ్రత్తగా భూములు, ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకుని అప్పులు ఇస్తున్నారు. ఇబ్రహీంపట్నం, కందుకూరు డివిజన్ల పరిధిలోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమనగల్లు, కడ్తాల్‌, మాడ్గుల, తలకొండపల్లి మండలాల్లో ఈవ్యాపారం జోరుగా సాగుతోంది.

రూ.2 వేల కోట్లకు పైనే ఖర్చు
జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులు రూ.2 వేల కోట్లకు పైగానే ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. చిన్న గ్రామంలో నాలుగు పార్టీల మద్దతుదారులు పోటీ చేస్తే రూ.2 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. అదే 2,500లకు పైగా ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీల్లో నలుగురైదుగురు బరిలో ఉంటే రూ.5 కోట్లకు పైగానే ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో ఈమొత్తం కొంత తగ్గే అవకాశం ఉన్నా, జనరల్‌, బీసీ స్థానాల్లో అంతకు మించి పెరుగుతుంది. ఫ్యూచర్‌ సిటీ పరిధిలోని గ్రామాల్లో పంచాయతీ సమరం మరింత వేడిగా సాగే చాన్స్‌ ఉంది.
 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు