Breaking News

ఊహాజనిత అంచనాలొద్దు

Published on Wed, 01/01/2025 - 01:34

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025–26) గాను వార్షిక బడ్జెట్‌ తయారీ కోసం అన్ని ప్రభుత్వ శాఖలు తమ అంచనాలను జనవరి 4వ తేదీలోగా పంపాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఈ మేరకు బడ్జెట్‌ రూపకల్పన మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మంగళవారం జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం... 

» అన్ని ప్రభుత్వ విభాగాలు ఈనెల 4వ తేదీలోగా ఐఎఫ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో తమ బడ్జెట్‌ ప్రతిపాదనలను ఆయా శాఖలకు పంపాల్సి ఉంటుంది. అదే రోజున ఆయా శాఖాధిపతులు వాటిని పరిశీలించి మార్పులు, చేర్పులు చేసిన అనంతరం ఆర్థిక శాఖకు పంపాల్సి ఉంటుంది.  

» ఊహాజనిత అంచనాలకు పోకూడ దు. తమకు అవసరమయ్యే వాస్తవిక నిధుల కంటే ఎక్కువ లేదా తక్కువ మొత్తాలను ప్రతిపాదించకూడదు.  

» గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ పద్దుల కింద చేసే ఖర్చును అన్ని శాఖలు తగ్గించుకోవాలి.  

»ప్రతి శాఖ విధిగా వ్యవస్థీకృత వ్యయాన్ని ప్రతిపాదించాలి. ఆఫీసుల నిర్వహణ, వాహనాలు, అద్దెలు, విద్యుత్, తాగునీటి ఖర్చులు, ఔట్‌సోర్సింగ్‌ సర్వీసులు, సంక్షేమ, సబ్సిడీ పథకాలకు అయ్యే వ్యయ అంచనాలను పంపాల్సి ఉంటుంది.  

» డిసెంబర్‌ 31, 2024 వరకు ఉన్న నికర అప్పుల వివరాలను పంపాలి. ప్రతి శాఖలో ఉన్న శాశ్వత ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగుల వివరాలు పంపాలి. 

» అన్ని శాఖలు 2024–25 ఆర్థిక సంవత్సరపు సవరించిన అంచనాలను కూడా పంపాలి. ఆదాయ మార్గాలను పెంచుకునే అవకాశాలను రాబడి శాఖలు ప్రతిపాదించాలి.  

»  వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాలను ప్రారంభించాల్సి ఉంటే అందుకు సంబంధించిన వివరాలు, అయ్యే ఖర్చును విధిగా ప్రతిపాదించాలి.  

»ప్రభుత్వ శాఖల్లో అమలు పరిచేందుకు వీలున్న కేంద్ర ప్రాయోజిత పథకాలను (సీఎస్‌ఎస్‌) గుర్తించడం ద్వారా కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టుకునే వీలున్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిష్పత్తిని పేర్కొంటూ ప్రతిపాదనలు పంపాలి.  

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)