Breaking News

నేనేం పాపం చేశాను నాన్నా? 

Published on Fri, 01/06/2023 - 10:30

మహబూబ్‌నగర్‌ క్రైం: భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యపై ఉన్న ఆక్రోశంతో తన ఆరేళ్ల కూతురిని గొంతు నులిమి హత్య చేశాడు. ఈ విషాదకర ఘటన మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వివరాల ప్రకారం.. పాలకొండ తండాకు చెందిన నేనావత్‌ శివ, శోభకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లయిన కొత్తలో బాగానే ఉన్నప్పటికీ.. కొంతకాలానికి శివ మద్యానికి అలవాటుపడి తరచూ భార్యతో గొడవపడి కొట్టేవాడు. ఈ క్రమంలో పది రోజుల కిందట భార్యను కొట్టడంతో పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. దీంతో శివ భార్య పుట్టింటికి వెళ్లి పెద్ద కూతురు కీర్తన (6) ఇంటికి తీసుకొచ్చాడు. ఈనెల 4న కీర్తనను శివ కొట్టాడు. 

దీంతో బాలిక అమ్మ కావాలని మారాం చేసింది. కోపోద్రిక్తుడైన తండ్రి ఏమాత్రం కనికరం లేకుండా కూతురు ముక్కు మూసి, గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత పాప పలకడం లేదని ఆటోలో జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అప్పటికే కీర్తన మృతి చెందిందని వైద్యులు చెప్పారు. మృతురాలి తల్లి శోభ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివపై పోలీసులు హత్య కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)