Breaking News

బిడ్డా నీ వెంటే నేను..

Published on Fri, 08/29/2025 - 11:28

రాజన్న సిరిసిల్ల జిల్లా: ముగ్గురు వ్యక్తులు లైంగిక వేధిస్తున్నారని మనస్తాపానికి గురైన బాలిక మూడు రోజుల క్రితం మరణించగా.. బిడ్డా నీ వెంట నేనంటూ తండ్రి ఉరివేసుకొని గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రంగంపేట గ్రామానికి చెందిన బాలిక తనను ముగ్గురు వ్యక్తులు లైంగికంగా వేధిస్తున్నారని లేఖరాసి, మనస్తాపానికి గురై సోమవారం చనిపోయింది. పోస్ట్‌మార్టం అనంతరం మంగళవారం సాయంత్రం మృతదేహాన్ని స్వగ్రామంలో ఖననం చేశారు.

 ఒంటరిగా ఉంటున్న మృతురాలి తండ్రి తిరుపతి (42) అదేరోజు సాయంత్రం తన సొదరితో కలిసి కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపేటకు వెళ్లాడు. కూతురు చనిపోయిందన్న మనస్తాపంతో గురువారం ఉదయం ఇంట్లో లుంగీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వర్షాలు తీవ్రంగా ఉండడంతో మృతదేహాన్ని స్వగ్రామం తీసుకురావడానికి ఇబ్బందికరంగా ఉందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి భార్య తన కొడుకుతో పాటు వేరుగా బెజ్జంకి మండలం చీలాపురంలో ఉంటోంది. కాగా.. తీపిరిశెట్టి తిరుపతి, మధుశాలిని నివసిస్తున్న రంగంపేటలోని ఇంటిని సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐ మొగిలి, ఇల్లంతకుంట ఎస్సై అశోక్‌ పరిశీలించారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)