Breaking News

Prathyusha Garimella: ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రత్యూష ఆత్మహత్య

Published on Sat, 06/11/2022 - 17:56

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ గరిమెళ్ల ప్రత్యూష ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ప్రత్యూష.. శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రత్యూష మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రత్యూష గదిలో కార్బన్‌మోనాక్సైడ్‌ బాటిల్‌ లభ్యమైంది. దీంతో ఆమె కార్బన్‌మోనాక్సైడ్‌ వాయువు పీల్చి మృతి చెందినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 

అనంతరం, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఫ్యాషన్‌ డిజైనర్‌గా ప్రత్యూష గుర్తింపు పొందారు. బాలీవుడ్‌, టాలీవుడ్‌లో ప్రముఖ హీరోయిన్లకు ప్రత్యూష డ్రెస్‌లు డిజైన్‌ చేశారు. దేశంలోని 30 మంది ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్స్‌లో ప్రత్యూష ఒకరుగా గుర్తింపు ఉంది.   రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌ కృష్ణారావు కుమార్తె ప్రత్యూష. 

సూసైడ్‌ నోట్‌ రాసిన ప్రత్యూష

ప్రత్యూష ఆత్మహత్యకు ముందు సూసైడ్‌ నోట్‌ రాసింది.  తల్లి దండ్రులకు భారం కాలేనని, క్షమించండి అంటూ సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. తాను కోరుకున్న జీవితం ఇది కాదని లేఖలో పేర్కొంది. 

కాగా, నిన్న రాత్రి జూబ్లీహిల్స్‌లోని సొంతింటి నుంచి బోటిక్‌కు వచ్చిన ప్రత్యూష.. అక్కడకు కేవలం ఒక బ్యాగ్‌తోనే వెళ్లింది. తనను ఎవరూ డిస్టర్బ్‌ చేయవద్దని లోపలికి వెళ్లేముందు వాచ్‌మెన్‌కు ప్రత్యూష చెప్పింది. ఎంతసేపటికీ ఆమె బయటకు రాకపోవడంతో వాచ్‌మెన్‌ వెళ్లి చూడగా.. ఆమె కిందపడిపోయి ఉండటంతో అతను పోలీసులకు సమాచారం అందించారు. 

అనంతరం పోలీసులు.. ప‍్రత్యూష మృతదేహానికి పోస్టుమార్టం నిమ్మితం ఆసుపత్రికి తరలించారు. కాగా, పోస్టుమార్టం రిపోర్టులో ప్రత్యూష కార‍్బన్‌మోనాక్సైడ్‌ వాయువు పీల్చుకోవడం వల్లే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.

మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకెళ్లండి..
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Videos

మావోయిస్టు కుంజమ్ హిడ్మా అరెస్ట్

వంశీ ఆరోగ్యంపై హైకోర్టు కీలక ఆదేశాలు

మహానాడులో నో ఫుడ్.. అచ్చెన్నాయుడు ఎందుకొచ్చారు అంటారా ఏంటి!

మహానేడులో చందాలు వసూలు.. కాక బాధపడ్తున్న ఇంద్రబాబు

తెలుగు టాప్ డైరెక్టర్స్ తో వెంకటేష్ వరుస సినిమాలు

మానవత్వం చాటుకున్న YSRCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి

రాజమౌళి-మహేష్ బాబు సినిమాని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరో..!

వైఎస్ రాజారెడ్డి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జగన్..

వెళ్లిపోకండయ్యా.. బతిమాలుకుంటున్న బాబు

మహానాడు ఎఫెక్ట్.. డిపోల్లో బస్సులు లేక ప్రయాణికుల అగచాట్లు

Photos

+5

జోగి రమేష్‌ తనయుడి వివాహ రిసెప్షన్‌.. నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశీర్వాదం (ఫొటోలు)

+5

అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్‌ పెళ్లి ఎప్పుడంటే! (ఫొటోలు)

+5

వైఎస్ రాజారెడ్డి శత జయంతి.. దివ్యాంగ చిన్నారులతో వైఎస్‌ జగన్ (ఫొటోలు)

+5

కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు (ఫొటోలు)

+5

#GaddarAwards2024 : గద్దర్‌ అవార్డులు-2024 (ఫొటోలు)

+5

Miss world 2025 : ఆల్‌ ది బెస్ట్‌ మిస్‌ ఇండియా నందిని గుప్తా (ఫోటోలు)

+5

ట్రంప్‌ చెప్పేదొకటి.. చేసేదొకటి! మస్క్‌కు మండింది (చిత్రాలు)

+5

విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

'సీతా పయనం' మూవీ టీజర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

అనాథ పిల్లలతో ఆడి, పాడిన సుందరీమణులు..సెల్ఫీలు, వీడియోలు (ఫొటోలు)