Breaking News

షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని రైతుల రాస్తారోకో

Published on Tue, 09/24/2024 - 04:56

తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు సోమవారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని కామారెడ్డి– ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు రోడ్డుపై పాలు పోసి నిరసన వ్యక్తం చేశారు. గంటసేపు రైతులు బైఠాయించడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. 

రైతు ప్రతినిధులు మాట్లాడుతూ రుణమాఫీ విషయంలో ప్రభుత్వం కొర్రీలు పెడుతూ రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు రైతుబంధు వేయలేదన్నారు. అన్ని రకాల ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 చొప్పున బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

పాడి రైతులకు విజయ డెయిరీ నుంచి నాలుగు నెలల బిల్లులు రావాలని, వెంటనే వాటిని రైతుల ఖాతాలో జమ చేయాలన్నారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న తాడ్వాయి, గాంధారి ఎస్సైలు తమ సిబ్బందితో అక్కడకు చేరుకొని రైతుల ఆందోళనను విరమింపజేశారు. అనంతరం రైతులు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్‌ రహిమొద్దీన్‌కు వినతిపత్రం అందజేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)