Breaking News

‘మైనింగ్‌’ అనుమతులు రద్దు చేయండి

Published on Tue, 01/21/2025 - 06:12

బల్మూర్‌/వెల్దండ: మైనింగ్‌ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండలంలోని మైలారం గ్రామస్తులు పురుగుమందు డబ్బాలతో రోడ్డెక్కారు. వివరాల్లోకి వెళితే.. మైలారం గుట్టపై సర్వే నంబర్‌ 121లోని 35 ఎకరాల్లో మైనింగ్‌ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ సోమవారం నుంచి గ్రామంలో రిలే దీక్షలు చేపట్టేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. అయితే దీక్షలకు అనుమతి లేదంటూ పోలీసులు కొందరిని ముందస్తుగా అరెస్టు చేశారు. మరోవైపు గ్రామస్తుల ఆందో ళనకు మద్దతు ప్రకటించేందుకు, మైలారం గుట్టను పరిశీలించడానికి ప్రొఫెసర్‌ హరగోపాల్, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ వస్తుండగా.. వెల్దండలో పోలీసులు అడ్డుకొని స్టేషన్‌కు తరలించారు.

దాదాపు గంటసేపు వారిని స్టేషన్‌లోనే ఉంచారు. విషయం తెలియగానే కోపోద్రిక్తులైన గ్రామస్తులు ప్రధాన రహదారిపై ముళ్ల కంచె వేసి పురుగుమందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. అక్రమంగా అరెస్టు చేసిన తమ గ్రామస్తులను విడుదల చేయడంతోపాటు గ్రామానికి ఎమ్మెల్యే వచ్చి..మైనింగ్‌ అనుమతులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. గుట్టపై ప్రజాభిప్రాయం లేకుండానే మైనింగ్‌ తవ్వకాలకు అధికారులు ఎలా అనుమతులు ఇస్తారని నిలదీశారు.  

ఆరు గంటలపాటు ఉద్రిక్తత 
ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సీఐ రవీందర్, ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో లింగాల, ఉప్పునుంతల, అమ్రాబాద్, అచ్చంపేట, సిద్దాపూర్‌ పోలీసులు అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. గ్రామస్తులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మైలారం గ్రామం మీదుగా అప్పాయిపల్లి, అంబగిరి, చెన్నంపల్లి గ్రామాలకు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. మధ్యాహ్నం తర్వాత గ్రామానికి చెందిన మైలారం గుట్ట పోరాట సమితి అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, లింగయ్యగౌడ్, లక్ష్మయ్య, సుమిత్ర తదితరులను పోలీసులు విడుదల చేయడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.

ఖనిజ లవణాలపై గద్దల్లా వాలుతున్నారు: ప్రొఫెసర్‌ హరగోపాల్‌
దేశవ్యాప్తంగా ఖనిజ, లవణాలను తవ్వేందుకు గద్దల్లా వాలిపోతున్నారని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. ప్రకృతిని నాశనం చేసే మైనింగ్‌ తవ్వకాలను ప్రభుత్వాలు నిలిపివేయకుండా వ్యాపారులకు మద్దతు తెలపడం ఏమిటని ప్రశ్నించారు. స్టేషన్‌ నుంచి బయటకు వచ్చి అనంతరం హరగోపాల్‌ విలేకరులతో మాట్లాడుతూ ప్రకృతిని నాశనం చేయడం వల్ల భవిష్యత్‌ తరాలకు ఆక్సిజన్‌ అందడం కష్టంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం పునరాలోచించి మైలారంలో మైనింగ్‌ తవ్వకాలను నిలిపివేయాలన్నారు. ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూడటం తగదని చెప్పారు. 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)