Breaking News

కురుస్తున్న వర్షం... రైతన్న హర్షం

Published on Thu, 07/03/2025 - 06:23

సాక్షి, హైదరాబాద్‌: రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయం ఊపందుకుంది. ఇప్పటికే పత్తి సాగులో రైతులు బిజీగా ఉండగా, వర్షాల రాకతో వరిసాగు పెరుగుతోంది. చాలా జిల్లాల్లో బావులు, బోర్లు కింద ఇప్పటికే నారుమళ్లు పోశారు. కొన్ని జిల్లాల్లో నాట్లు ప్రారంభం కాగా, మరికొన్ని ప్రాంతాల్లో నాట్లేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రాజెక్టులు, చెరువుల కింద ఉన్న పొలాల్లో రైతులు దుక్కులు దున్నుతూ సేద్యానికి సిద్ధమవుతున్నారు. 

నిజామాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటికే రైతులు నారుమళ్లు పోసి.. వరి నాట్లేసే కార్యక్రమాలు ప్రారంభించారు. మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల్లో వరిసాగుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో వ్యవసాయ అధికారులు తగిన సూచనలు, సలహాలతో పంటల సాగును పర్యవేక్షిస్తున్నారు.  

నిజామాబాద్‌లో లక్షన్నర ఎకరాల్లో ఇప్పటికే సాగు  
నిజామాబాద్‌లో ఇప్పటికే లక్షన్నర ఎకరాల్లో రైతులు వరిని సాగు చేశారు. కామారెడ్డిలో 27 వేల ఎకరాల్లో వరి సాగు కాగా, జనగాంలో 15వేల ఎకరాల్లో సాగైంది. ఉమ్మడి కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఈ వారాంతానికి బోర్లు, బావులతోపాటు చెరువులు, కుంటల కింద కూడా నార్లు పోస్తారని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మిడ్‌ మానేర్, దిగువ మానేరుతో పాటు దేవాదుల, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల కింద నీటి లభ్యతను బట్టి వరిసాగు చేస్తారని తెలిపారు.  

పత్తి, మొక్కజొన్నకు జీవం 
ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల మెట్టభూముల్లో సాగైన పత్తి, మొక్కజొన్న పంటలకు జీవం పోసినట్టయ్యింది. నెలరోజుల క్రితం నుంచే పత్తి సాగు మొదలు కాగా, జూన్‌ మొదటి వారం నుంచే వరుణుడు మొహం చాటేయడంతో రైతులు ఆందోళన చెందారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చాలా ప్రాంతాల్లో పత్తి మొలకెత్తలేదు. కొన్నిచోట్ల మొలకలు వచ్చినా, నీరు లేక ఎండిపోయాయి. కరీంనగర్, మెదక్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో కూడా వర్షాలు లేక పత్తి రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. 

రాష్ట్రంలో ఇప్పటి వరకు 43.47 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, అందులో పత్తి 31 లక్షల ఎకరాల్లో సాగయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే పత్తి అధికంగా సాగయ్యే ఆదిలాబాద్‌లో వాతావరణం కొంత అనుకూలంగా ఉండటంతో రైతులకు ఊరటనిచ్చింది. ఇదే జిల్లాలో సోయాబీన్, కంది కూడా ఎక్కువగానే సాగు చేశారు. ఈ వర్షాలతో ఆదిలాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో పత్తి, మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఆనందం వ్యక్తం చేశారు.  

కూరగాయల సాగుకు ఊతం 
రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల కూరగాయల సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఈసారి కూరగాయల సాగు ఎక్కువగా ఉంటుందని ఉద్యానవనశాఖ అంచనా వేస్తుంది.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)