పోలీస్‌ అంటూ.. మహిళా హాస్టల్‌కు వెళ్లి..

Published on Thu, 07/02/2026 - 07:19

హైదరాబాద్‌:  పోలీస్‌ అవతారమెత్తి  వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని పేట్‌బష్‌రాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం పేట్‌బష్‌రాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో  ఏసీపీ శంకర్‌ రెడ్డి వివరాలు వెల్లడించారు. మెదక్‌ జిల్లాకు చెందిన  పాండి యాదగిరి అలియాస్‌ అనీల్‌కుమార్‌ (25) సిద్దిపేట జిల్లా బండమైలారం గ్రామంలో సెక్యూరిటీ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. 

గతంలో మహంకాళి ట్రాఫిక్‌ పోలీసు విభాగంలో క్యాజువల్‌ లేబర్‌గా పనిచేసిన సమయంలో పోలీసుల పనితీరుపై  అవగాహన ఏర్పడింది.  డబ్బు సంపాదించాలనే ఆశతో అతను పోలీసు యూనిఫామ్,  మోటార్‌ సైకిల్‌ను కొనుగోలు చేసి, పోలీసు అధికారిగా నటిస్తూ తిరగడం ప్రారంభించాడు. దుండిగల్‌లోని ఓ బాలికల హాస్టల్‌ను లక్ష్యంగా చేసుకుని వసూళ్లకు పాల్పడ్డాడు. 

పేట్‌బష్‌రాబాద్‌–మేడ్చల్‌ హైవేపై ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా నటిస్తూ వాహనదారుల నుండి డబ్బు వసూలు చేశాడు. సుచిత్రలోని మోనిడాశ్రీ గరŠల్స్‌ హాస్టల్‌కు వచి్చన యాదగిరి రాత్రి  హాస్టల్‌లో కార్యకలాపాలు నిలిపివేయాలని యజమాన్యాన్ని బెదిరించాడు. ఈ నెల 29న రాత్రి  మరోసారి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడు. అమ్మాయిలపై ప్రాసిస్ట్యూషన్‌ కేసులు నమోదు చేస్తానని, వారి మొబైల్‌ ఫోన్‌లు లాక్కొని ఫొటోలు తీసి బెదిరించాడు. దీంతో హాస్టల్‌ నిర్వాహకుడు గుడూరు విజయ్‌కుమార్‌ ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పేట్‌బïÙరాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని  అరెస్టు చేశారు.   

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)