Breaking News

అమెరికా నుంచి నకిలీ సర్టిఫికెట్‌

Published on Thu, 01/11/2024 - 08:52

సాక్షి, హైదరాబాద్: అమెరికాలో ఉంటున్న ఓ స్నేహితుడు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్తో తన మిత్రుడిని అమెరికాకు రప్పించేందుకు యత్నించగా విఫలమై.. కటకటాలపాలయ్యాడు. స్పెషల్‌ ఆపరేషన్‌ టీం (ఎస్‌ఓటీ) ఎల్బీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని కర్మన్‌ఘాట్‌కు చెందిన పులిపాటి మణికంఠ బీటెక్‌ ఫెయిలయ్యాడు. ఉద్యోగ వెతుకులాటలో ఉన్నాడు. ఈ క్రమంలో అమెరికాలో ఉంటున్న తన స్నేహితుడు జనార్దన్‌ సూచన మేరకు మేఘాలయ – షిల్లాంగ్‌లోని విల్లియం కార్వే యూనివర్సిటీ నుంచి నకిలీ డిగ్రీ సరి్టఫికెట్‌ పొందాలని నిర్ణయించుకున్నాడు. 

ఈ క్రమంలో జనార్దన్‌ సూచన మేరకు నకిలీ విద్యార్హత పత్రాల తయారీదారు నరే‹Ùను కలిశాడు. అతడిని సంప్రదించి రూ.1.6 లక్షలు చెల్లించి విల్లీయం కార్వే యూనివర్సీటీకి చెందిన నకిలీ బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ డిగ్రీ సర్టిఫికెట్ పొందాడు. ఈమేరకు విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎల్బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు బుధవారం మణికంఠను అరెస్టు చేశారు. నరేష్, జనార్దన్‌లు పరారీలో ఉన్నారు. నిందితుడి నుంచి బీఎస్సీ సరి్టఫికెట్‌తో పాటు మూడు మార్క్స్‌ మెమోలు, ప్రొవిజనల్‌ సర్టిఫికెట్ , మైగ్రేషన్‌ సర్టిఫికెట్, సీఎంఎం సర్టిఫికెట్ , టీసీ, రెండు ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)