Breaking News

ఫేస్‌బుక్‌లో పరిచయం... పుస్తెలతాడుతో పరారీ

Published on Fri, 03/07/2025 - 12:46

వెంగళరావునగర్‌: ఫేస్‌బుక్‌లో పరిచయమై మాయమాటలు చెప్పి ఓ మహిళ నుంచి పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన సంఘటన మధురానగర్‌ పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్లారెడ్డిగూడకు చెందిన మహిళకు ఫేస్‌బుక్‌లో గోల్డ్‌ గ్రూప్‌ ద్వారా మహేష్‌ నారాయణదాస్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. 

ఆమె నంబర్‌ తీసుకున్న అతను తరచూ ఫోన్‌లో మాట్లాడేవాడు. గత ఫిబ్రవరిలో తన పుస్తెలతాడుకు బంగారు తీగ అల్లి ఇవ్వాలని కోరడంతో వారి ఇంటికి వచ్చాడు. ఇంటి వద్దే తీగ అల్లి ఇవ్వాలని కోరగా తాను కట్టర్‌ తీసుకురావడం మరచిపోయానని, కూకట్‌పల్లిలోని తన బంధువుల దుకాణానికి వెళ్లి అరగంటలో తెస్తానని చెప్పాడు. అతని మాటలు నమ్మిన బాధితురాలు 40 గ్రాముల పుస్తెలతాడు, పుస్తెలు అతడికి ఇచ్చింది .

కూకట్‌పల్లికి వెళ్లిన మహేష్‌ తన ఆధార్‌కార్డు, తండ్రి నెంబర్, షాప్‌ ఫొటోలు ఆమెకు వాట్సాప్‌ చేశాడు. సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో సదరు మహిళ ఫోన్‌ చేయగా తనకు యాక్సిడెంట్‌ అయిందని, త్వరలోనే వస్తానని చెప్పాడు. అయితే ఈ నెల 4న బాధితురాలికి ఫోన్‌ చేసిన మహేష్‌ ఆమెను దుర్భాషలాడటమేగాక పుస్తెలతాడు ఇవ్వనని, నీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకో అంటూ బెదిరించాడు. దాంతో బాధితురాలు మధురానగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)