Breaking News

వివాహేతర సంబంధాల యాప్‌.. టాప్‌–5లో హైదరాబాద్‌!

Published on Sun, 09/13/2026 - 11:33

సాక్షి, హైదరాబాద్‌: వివాహేతర సంబంధాల యాప్‌ల వినియోగంలో దేశంలోని టాప్‌–5 నగరాల్లో హైదరాబా­ద్‌ ఉన్నట్లు తేలింది. డిస్క్రీషన్‌ డేటింగ్‌(రహస్య డేటింగ్‌) పేరిట వివాహేతర సంబంధాలు ఏర్పరు­చు­కోవడానికి కెనడాకు చెందిన ఓ యాప్‌ అడ్డాగా మారింది. తాజాగా ఆ విదేశీ యాప్‌ సంస్థ ప్రకటించిన తాజా గణాంకాల ప్రకారం దేశంలో 5 లక్షల మందికిపైగా యాక్టివ్‌ యూజ­ర్లు ఉండగా.. ఇందులో హైదరాబాద్‌కు చెందిన 1.10 లక్షల మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. యూజర్ల సంఖ్య ఆధారంగా దేశంలోనే టాప్‌–5 నగరాల్లో భాగ్యనగరం ఉందని కంపెనీ పేర్కొంది. ఐటీ కారిడార్లు గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్‌ ప్రాంతాల నుంచే 60 శాతం ట్రాఫిక్‌ తమ యాప్‌నకు వస్తోందని వెల్లడించింది. మొత్తం యూజర్లలో 68 శాతం మంది 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వారు ఉంటున్నారట. కొన్ని నివేదికల ప్రకారం..ఈ యాప్‌ కొత్త సబ్‌స్క్రైబర్లలో భారత్‌ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది.

యాప్‌ ఫీచర్లలో గోప్యత
ఇండియా యూజర్‌ ట్రెండ్స్‌ అండ్‌ డేటా ప్రైవసీ నివేదిక ప్రకారం.. ఈ యాప్‌ అందించే రహస్య ఫీచర్లు వినియో­గదారులను ఆకర్షిస్తున్నాయి. ఫొటోలను బ్లర్‌ చేసుకొనే అవకాశం ఉండటం, క్రెడిట్‌ కార్డులతో చెల్లింపుల విధానం, బ్యాంక్‌ స్టేట్‌మెంట్లలో యాప్‌­పేరు కనిపించకుండా బిల్లింగ్‌ చేయడం వంటి సెక్యూరి­టీ ఫీచర్లు ఉండటం వల్ల ఇది ఇలాంటి కార్యక­లాపాలకు పాల్పడేవారికి ఆకర్షణీయంగా మారుతోంది.

పోలీసులు, సైబర్‌నిపుణుల హెచ్చరికలు
డేటింగ్‌ యాప్‌ల కోసం వెంపర్లాడే వారి­ని సైబ­ర్‌­నేరగాళ్లు బెదిరించి దోచుకొనే ప్రమాదం ఉందని సైబర్‌­ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్‌ క్రై మ్‌ గణాంకాల ప్రకారం డేటింగ్‌ యాప్‌ల­కు సంబంధించిన ఫిర్యాదులు మూడేళ్లలో 40% పెరిగాయి. మరోవైపు డిజిటల్‌ గోప్యతకు 100% గ్యారంటీ ఉండదని, బ్లాక్‌మె­యిల్, ఆర్థిక మోసాల ప్రమాదం ఉందని సైబర్‌ నిపుణులు హెచ్చరి­స్తున్నా­రు. వివాహేతర సంబంధాల వల్ల సామాజికంగా, మానసికంగా ఎదు­ర­య్యే పరిణామాలపై అవగాహన పెంచుకో­వాలని  మానసిక వైద్య నిపుణులు సూచి­స్తున్నారు. వైవాహిక బంధాలు బలహీన­పడ్డాయని డేటింగ్‌యాప్‌లను ఆశ్రయించడం సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని చెబుతున్నారు.  

ఇదీ చదవండి: ముకేశ్ కళ్ల గురించి దేబ్జానీ-నాగ్ డిస్కషన్

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)