Breaking News

క్రీడ‌ల‌తో ఉత్సాహం... చ‌దువులకు ప్రోత్సాహం

Published on Mon, 02/24/2025 - 18:12

కూక‌ట్‌ప‌ల్లి: విద్యార్థులు క్రీడ‌ల్లో పాల్గొన‌డం వ‌ల్ల మాన‌సిక ప్ర‌శాంత‌త చేకూరుతుంద‌ని, ఒత్తిడిని అధిగ‌మించ‌గ‌ల‌ర‌ని ఏకాగ్ర‌త పెరిగి చ‌దువుల్లో మరింత రాణిస్తార‌ని శ్రీచైత‌న్య విద్యాసంస్థ‌ల నిర్వ‌హకులు తెలిపారు. సంస్థ ఛైర్మ‌న్ బీఎస్ రావు.. జ్ఞాప‌కార్థం శ్రీచైత‌న్య విద్యాసంస్థ‌లు కూక‌ట్ ప‌ల్లి జోన్‌లోని వివిధ బ్రాంచ్‌ల విద్యార్థుల‌కు జోన‌ల్ లెవ‌ల్ స్పోర్ట్స్ మీట్‌ను హైద‌ర్ న‌గ‌ర్ గ్రౌండ్స్‌లో  ఘ‌నంగా నిర్వ‌హించింది.

శ్రీ చైత‌న్య అంటే చ‌దువు, ర్యాంకులు ఒక్క‌టే కాదని, త‌మ విద్యార్థులు క్రీడ‌ల్లోనూ రాణించ‌గ‌ల‌ర‌ని కూక‌ట్‌ప‌ల్లి ఏజీఎం శివ‌రామ‌కృష్ణ తెలిపారు. బీఎస్ రావు తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితుడని, డాక్ట‌ర్‌గా వృత్తి బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూ.. విద్యాసంస్థ‌లను ప్రారంభించి శ్రీచైత‌న్య అనే బ్రాండ్‌ను సృష్టించారని ఆయ‌న చూపించిన మార్గంలో నేడు ఎంతో మంది చ‌దువుల్లో జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో రాణించార‌ని కొనియాడారు.

సీనియ‌ర్లు, జూనియ‌ర్ల విభాగాల‌లో వేర్వేరుగా జ‌రిగిన వివిధ క్రీడల్లో రాణించిన విద్యార్థుల‌కు బ‌హుమ‌తులు అంద‌జేశారు. ఆయా బ్రాంచీల విద్యార్థులు చేసిన మార్చ్ ఫాస్ట్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. క్రీడా జ్యోతితో స్పూర్తిని పెంచి ఉత్తేజంతో విద్యార్థులు ఆట‌ల్లో పాల్గొన్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఏజీఎం ర‌వికుమార్‌, పార్ట్న‌ర్ అడ్వైజ‌ర్ ఫ‌ర్ ఉమెన్ & చైల్డ్ వెల్ఫేర్ వినోద్ కుమార్ బుర్రా హాజ‌ర‌య్యారు. ఆర్ ఐ శ్రీనివాస‌రెడ్డి, ఆల్ ఇండియా స్పోర్ట్స్ రీసోర్స్ ప‌ర్స‌న్ రాజ‌శేఖ‌ర్‌, ఆయా బ్రాంచ్‌ల ప్ర‌ధానోపాధ్యాయులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)