Breaking News

సుప్రీం మార్గదర్శకాల మేరకు..బీసీ రిజర్వేషన్లను నిర్ధారించండి

Published on Wed, 09/11/2024 - 03:11

సాక్షి, హైదరాబాద్‌: వికాస్‌ కిషన్‌రావ్‌ గవాలీ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు బీసీ రిజర్వేషన్లను నిర్ధారించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ‘స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలుపై అధ్యయనానికి రాజ్యాంగబద్ధమైన కమిషన్‌ ఏర్పాటు చేయాలి.. సామాజిక, రాజకీయ అంశాలు, వెనుకబాటుతనం లాంటి అంశాలను పరిశీలించి జనాభా నిష్పత్తికి అనుగుణంగా బీసీ రిజర్వేషన్లు నిర్ధారించాలి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లన్నీ 50 శాతానికి మించకూడదు’ అని వికాస్‌ కిషన్‌రావ్‌ గవాలీ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కేసులో పేర్కొన్న ఈ మూడు సూత్రాలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. 

దీన్ని అమలు చేసేందుకు మూడు నెలల సమయం కావాలని అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి కోరారు. దీంతో తదుపరి విచారణను 3 నెలలకు వాయిదా వేస్తూ, అప్పటిలోగా నివేదిక అందజేయాలని తేల్చిచెప్పింది. రాష్ట్రంలో బీసీల జనాభా వివరాలను సేకరించడానికి, సర్వేల నిర్వహణకు తెలంగాణ బీసీ కో–ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ను అధీకృత సంస్థగా ప్రభుత్వం గుర్తించడం రాజ్యాంగ వ్యతిరేకమని.. రాజ్యాంగ బద్ధమైన బీసీ కమిషన్‌ ఏర్పాటు చేసి రిజర్వేషన్లను నిర్ణయించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ సహా మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. 

ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.శ్రీనివాస్‌రావు మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ధర్మేశ్‌ డీకే జైస్వాల్, శ్రీనివాస్‌ యాదవ్, కౌటూరు పవన్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్, కేంద్రం తరఫున డీఎస్‌జీ గాడి ప్రవీణ్‌కుమార్‌ హాజరయ్యారు. వికాస్‌ కిషన్‌రావ్‌ గవాలీ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల్లోని పేరా 13 అమలుపై వివరాలు తెలుసుకుని చెబుతామని గత విచారణ సందర్భంగా ఏజీ వెల్లడించారు. 

మంగళవారం విచారణ సందర్భంగా మూడు అంశాలు అమలు చేయడానికి ఎంత సమయం కావాలని ఏజీని ధర్మాసనం ప్రశ్నించింది. పూర్తి అధ్యయనానికి 3 నెలల సమయం కావాలని కోరడంతో అనుమతించిన ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది.  

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు