Breaking News

షవర్‌కు ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

Published on Mon, 02/16/2026 - 10:55

ఇంటర్‌ స్టూడెంట్‌ బలవన్మరణం
చింతల్‌: పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. కొంపల్లిలో నివాసముంటున్న అశోక్‌బాబు కుమార్తె నాగలిఖిత (17) జీడిమెట్లలోని శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసిన తన గదిలో చదువుకోవడానికి వెళ్లింది. కాసేపటి తరువాత చెల్లెలు గీతిక సాయి గది తలుపు తట్టగా స్పందన రాలేదు. అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌ సహాయంతో తలుపు తాళం విరగొట్టి లోపలికి వెళ్లగా చున్నీని మెడకు కట్టుకొని మంచానికి చున్నీని కట్టి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. వెంటనే 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.  

షవర్‌కు ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య 
ఫిలింనగర్‌: ఇంజినీరింగ్‌ చదువుతున్న ఓ విద్యార్థిని షవర్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఫిలింనగర్‌ పోలీసులు తెలిపిన మేరకు.. వరంగల్‌ మహబూబాబాద్‌కు చెందిన గుగులోత్‌ సంధ్యారాణి(20) షేక్‌పేటలోని నారాయణమ్మ మహిళా ఇంజనీరింగ్‌ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది. సమీపంలోని ఫాల్కన్‌ వ్యాలీ కాలనీలో హాస్టల్‌లో ఉంటోంది. ఆదివారం ఉదయం ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి బ్రేక్‌పాస్ట్‌ చేసిన అనంతరం సెలవు దినం కావడంతో అంతా పడుకున్నారు. అదే సమయంలో సంధ్యారాణి బాత్‌రూమ్‌లోకి వెళ్లి చున్నీతో షవర్‌కు ఉరేసుకుంది. 

కాసేపటి తరువాత మిత్రులు బాత్‌రూమ్‌ తట్టగా లోపలి నుంచి గడియ వేసి ఉంది.దీంతో హాస్టల్‌ యజమానికి సమాచారం ఇచ్చారు. బాత్‌రూమ్‌ తలుపులు పగులగొట్టి చూడగా షవర్‌కు వేలాడుతూ మృతదేహం కనిపించింది. దీంతో ఫిలింనగర్‌ పోలీసులకు సమాచారం అందజేశారు.  తన చావుకు ఎవరూ కారణం కాదని, ఈ చావుపై ఎలాంటి విచారణ చేయవద్దని మృతురాలు వాట్సప్‌ మెసేజ్‌ పెట్టింది. ఈ మేరకు తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన కూతురు ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తంచేశారు. కళాశాల యాజమాన్యం, వేధింపుల వల్లనే తన కూతురు చనిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుమానాస్పద మృతి కింద ఫిలింనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)