Breaking News

సమస్య ఉంటే ఈ నంబర్లకు కాల్‌ చేయండి

Published on Mon, 06/17/2024 - 06:23

సాక్షి, హైదరాబాద్‌: ఈదురుగాలులతో కూడిన వర్షానికి తరచూ ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. చెట్ల కొమ్మలు విరిగి పడుతుండటంతో వైర్లు తెగుతున్నాయి. విద్యుత్‌ స్తంభాలు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలుతున్నాయి. దీనితో గంటల తరబడి సరఫరా నిలిచిపోతోంది. అలాంటి సమయంలో వినియోగదారులు 1912 కాల్‌ సెంటర్‌/ మొబైల్‌యాప్‌లో/ స్థానిక లైన్‌మన్లకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలకు ఆస్కారం ఇవ్వకూడదనే ఉద్దేశంతో సర్కిళ్ల వారీగా ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

సర్కిల్‌ పేరు                 ఫోన్‌ నంబర్‌ 
హైదరాబాద్‌ సెంట్రల్‌    9491629047 
హైదరాబాద్‌ సౌత్‌    9491628269     
సికింద్రాబాద్‌    9491629380 
బంజారాహిల్స్‌    9491633294 
సైబర్‌సిటీ    9493193149 
రాజేంద్రనగర్‌    7382100322 
సరూర్‌నగర్‌    7901679095 
హబ్సిగూడ    9491039018 
మేడ్చల్‌    7382618971 
వికారాబాద్‌    9493193177

విద్యుత్‌ సరఫరా, తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు, చేపట్టిన అభివృద్ధి పనులపై గతంలో నెలకోసారి రివ్యూలు నిర్వహించేవారు. ప్రస్తుతం రోజు ఉదయం 8.30 గంటలకే టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిస్తున్నాం. బ్రేక్‌ డౌన్లు, గృహజ్యోతి దరఖాస్తులు, సేవల్లో లోపాలపై ఆన్‌లైన్‌లో అందుతున్న ఫిర్యాదులపై చర్చిస్తున్నాం. అంతర్గత సామర్థ్యం పెంపు, నష్టాల నియంత్రణపైనా చర్యలు చేపట్టాం. అత్యవసర పరిస్థితుల్లో సీజీఎంలు, ఎస్‌ఈలు, డీఈలు, ఏడీ ఈలు, ఏఈలు, జూనియర్‌ లైన్‌మెన్లు, ఆరి్టజన్లు అంతా అందుబాటులో ఉండేలా ఆదేశాలిచ్చాం. అర్ధరాత్రి, భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా లైన్ల పునరుద్ధరణ పనులు చేపడుతున్నాం. బ్రేక్‌డౌన్, ఇతర అంతరాయాలను చాలా వరకు తగ్గించాం.

సరఫరా మెరుగుపడాలంటే ఏం చేయాలి? 
⇒ విద్యుత్‌ స్తంభాల పాలిట ఉరితాళ్లుగా మారిన టీవీ, ఇంటర్నెట్‌ కేబుళ్లను తక్షణమే తొలగించాలి. 
⇒ లైన్‌ టు లైన్‌ తనిఖీలు చేపట్టి అనధికారిక కనెక్షన్లను తొలగించాలి. అంతర్గత భారీ నష్టాల నుంచి సంస్థను గట్టెక్కించాలి. 
⇒ ఏబీ స్విచ్‌ల నాణ్యతను పరిశీలించాలి. సరఫరాలో హెచ్చుతగ్గుల నియంత్రణ, షార్ట్‌ సర్క్యూట్ల నియంత్రణ కోసం ఎర్తింగ్‌ సిస్టంను పకడ్బందీగా ఏర్పాటు చేయాలి. 
⇒ చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భూగర్భ కేబుళ్లు, ఎయిర్‌ బంచ్‌డ్‌ కేబుళ్లు ఏర్పాటు చేస్తే.. ఈదురుగాలులతో సరఫరా నిలిచే సమస్య తలెత్తదు. 

⇒  భూగర్భ విద్యుత్‌ కేబుళ్ల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా డక్ట్‌ సిస్టం ఏర్పాటు చేయాలి. 
⇒ డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలి. అక్కడి చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా అగ్ని ప్రమాదాలను నివారించొచ్చు. 
⇒  ఏఈలు, ఏడీఈలు కేవలం కొత్త కనెక్షన్ల జారీ, మీటర్‌ రీడింగ్‌లపైనే దృష్టి సారిస్తున్నారు. వారు సాంకేతిక అంశాలపైనా దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలి. 

⇒  కోర్‌సిటీలో ఇప్పటికీ నిజాం కాలం నాటి లైన్లే ఉన్నాయి. చాలాచోట్ల ఒకే స్తంభం నుంచి ఎల్‌టీ, హెచ్‌టీ లైన్లు వెళ్తున్నా యి. ప్రమాదాలను నివారించేందుకు వీటిని వేరు చేయాలి. 
⇒ కొందరు జూనియర్‌ లైన్‌మన్లు.. అనధికారికంగా ఎలాంటి అనుభవం, అవగాహన లేని ప్రైవేటు వ్యక్తులను అసిస్టెంట్లుగా నియమించుకుని.. వారితో పనులు చేయిస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి, చర్యలు తీసుకోవడం ద్వారా సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడొచ్చు. 

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?