Breaking News

గ్రేటర్‌ హైద‌రాబాద్‌లో పెరిగిన‌ గృహజ్యోతి ల‌బ్ధిదారుల సంఖ్య

Published on Sun, 12/01/2024 - 19:34

సాక్షి, హైద‌రాబాద్‌:  గృహజ్యోతి పథకం ల‌బ్ధిదారుల సంఖ్య గ్రేటర్‌లో రోజురోజుకూ పెరుగుతోంది. 200 యూనిట్లలోపు వినియోగించే గృహాలకు ఈ పథకం కింద ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో ల‌బ్ధిదారుల సంఖ్య 8,71,841 ఉండగా, నవంబర్‌ నాటికి 10,52,432కు చేరింది. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ప్రభుత్వం గత మార్చి నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. 

చలిగాలులు వీస్తుండటంతో.. 
గృహజ్యోతి పథకానికి గ్రేటర్‌లో 21 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటి వరకు పదిన్నర లక్షల మందికిపైగా అర్హత సాధించారు. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉత్తరాది నుంచి చలి గాలులు వీస్తుండటంతో ఇప్పటికే ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు ఆఫ్‌ చేశారు. ఫలితంగా నిన్నా  మొన్నటి వరకు నెలకు సగటున 200 యూనిట్లకుపైగా విద్యుత్‌ వినియోగించిన వారు.. ప్రస్తుతం 150 యూనిట్ల లోపే వాడుతున్నారు. ఫలితంగా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఈ ల‌బ్ధిదారుల సంఖ్య మరింత పెరగనున్నట్లు డిస్కం అంచనా వేస్తోంది.  

9 నెలల్లో కోటికి చేరిన జీరో బిల్లులు.. 
గృహజ్యోతి పథకం కింద ఒక్కో వినియోగదారుకు నెలకు సగటున రూ.1,150 నుంచి రూ.1,200 వరకు లబ్ధి చేకూరుతోంది. సర్కిళ్ల వారీగా పరిశీలిస్తే.. ల‌బ్ధిదారుల పెరుగుదల రేటు హైదరాబాద్‌ సౌత్‌లో అత్యధికంగా 54.07 శాతం నమోదైంది. మేడ్చల్‌ సర్కిల్‌లో అతి తక్కువగా 9.28 శాతం నమోదైంది. గ్రేటర్‌ మొత్తంగా పరిశీలిస్తే.. 20.71 శాతం నమోదు కావడం గమనార్హం. గత తొమ్మిది మాసాల కాలంలో ఈ పథకం కింద గ్రేటర్‌లో సుమారు కోటి జీరో బిల్లులు జారీ అయ్యాయి. పథకం అమలుతో ప్రభుత్వంపై నెలకు సగటున రూ.100 కోట్లకుపైగా భారం పడుతోంది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)