Breaking News

ఎలక్ట్రిక్‌ వాహనాల దూకుడు

Published on Sun, 02/02/2025 - 10:18

గ్రేటర్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల దూకుడు పెరగనుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈవీలపై జీవితకాల పన్ను మినహాయించింది. దీంతో కొంతకాలంగా నగరంలో ఎలక్ట్రిక్‌ బైక్‌లు, ఆటోలు, కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. తాజాగా కేంద్రం ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రోత్సాహాన్నిచ్చేలా రాయితీలను ప్రకటించింది. ఈ వాహనాలకు వినియోగించే  బ్యాటరీలకు వాడే  35 రకాల ముడి పదార్థాలపై పన్ను మినహాయించారు. దీంతో ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు తగ్గుతాయని రవాణారంగం నిపుణులు  పేర్కొంటున్నారు. 

15 శాతం నుంచి  20 శాతం ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు అంచనా. బైక్‌లపై గరిష్టంగా రూ.10 వేల వరకు, కార్లు, ఇతర వాహనాలపై రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ధరలు తగ్గవచ్చని ఆటో మైబైల్‌ డీలర్లు సైతం అంచనా వేస్తున్నారు. మరోవైపు 15 ఏళ్లు దాటిన వాహనాలను స్వచ్ఛందంగా  తుక్కుగా మార్చుకొంటే వాటి స్థానంలో  కొనుగోలు చేసేవాటిపై  సబ్సిబీ లభించనుంది. కాలపరిమితి ముగిసిన వాటిను తుక్కు చేసి  కొత్తగా ఈవీలను కొనుగోలు చేస్తే మరింత ప్రయోజనం కలగనుంది. 

లగ్జరీ వాహనాల ధరలు తగ్గుముఖం.. 
మరోవైపు కేంద్రం తాజా బడ్జెట్‌లో దిగుమతి చేసుకొనే వాహనాలపై కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గించనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో హైఎండ్‌ వాహనాల ధరలు కూడా తగ్గుముఖం పట్టనుంది. లగ్జరీ బైక్‌లు, కార్లు, బస్సులు, ఇతర వాహనాల ధరలు కూడా  12 శాతం నుంచి  25 శాతం వరకు తగ్గనున్నట్లు ఆటోమొబైల్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి  

ఈవీలకు ఇది ప్రోత్సాహకరం 
ఈవీ ధరలు నేరుగా తగ్గకపోయినా బ్యాటరీ ముడి పదార్థాలపై పన్ను మినహాయించడం వల్ల  ఈవీ ఉత్పత్తులకు ప్రోత్సాహం లభిస్తుంది. దీంతో ధరలు తగ్గుముఖం పడతాయి. బ్యాటరీల తయారీకి వినియోగించే 35 రకాల పదార్థాలపై కేంద్రం పన్ను మినహాయింపునివ్వడం ఎంతో సంతోషంచదగ్గ అంశం. ఇది ఆటోమేటిక్‌గా ఎలక్ట్రిక్‌ వాహనాల ధరల తగ్గింపునకు దోహదం చేస్తుంది.  
– సంధ్య, ఎలక్ట్రిక్‌ వాహన డీలర్‌  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)