Breaking News

ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకే ఎన్నికలు

Published on Wed, 12/03/2025 - 04:18

సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణ ప్రజాస్వామ్య విలువ­ల పరిరక్షణ కోసమే పంచాయతీ ఎన్నికలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మాధవీదేవి స్పష్టం చేశా రు. రాజ్యాంగ ఉద్దేశం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జనాభా లేని వర్గాలకు సర్పంచ్, వార్డు స్థానాలను రిజర్వ్‌ చేస్తే ఎన్నికలు నిలిచి పోయి వాటి ప్రయోజ నానికి భంగం వాటిల్లుతుందని అభిప్రాయపడ్డారు. ఇతర వర్గా­లకు రిజర్వ్‌ చేయాలని తాము ఆదేశిస్తే అది ఎన్నికల నిర్వహణ ను ప్రభావితం చేస్తుందని వ్యాఖ్యానించారు. 

తమ ముందున్న పిటిషన్లు విసృత పరిణామాలతో ముడిపడి ఉన్నందున వాటిని ద్విసభ్య ధర్మాసనం ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తదుపరి విచారణ బుధవారానికి వా యిదా వేశారు. వరంగల్‌ జిల్లా మహమూద్‌ పట్నంలో ఆరుగురు ఎస్టీలుంటే సర్పంచ్‌ పోస్టుతోపాటు 3 వా ర్డులను కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ ఆ గ్రామానికి చెందిన యాకూబ్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇలాంటివే మరో ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్‌ టి. మాధవీదేవి విచా రణ చేపట్టి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఎన్నికలు నిలిచిపోవడం సరికాదు.. 
‘రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు నవంబర్‌ 25న నోటిఫికేషన్‌ ఇచ్చింది. 2011 జనాభా లెక్క లు, 2014 గణాంకాల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ జనాభాను తీసుకొని పాలసీ ప్రకారం, రోస్టర్‌ రొటేషన్‌ ద్వారా సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను రిజర్వ్‌ చేసింది. తమ గ్రామాల్లో రిజర్వేషన్‌ కులం లేదని కొందరు, అతికొద్ది మందే ఉన్నారని మరికొందరు పిటిషన్లు వేశారు. రిజర్వ్‌ అయిన కులాల వారు లేకుంటే స్థానాలు ఖాళీగా ఉండే ఉంటాయని.. అలాంటి చోట రిజర్వేషన్లను పునఃపరిశీలించాలని, సంబంధిత గ్రామాల్లోని ప్రస్తుత జనాభా ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్లు కోరుతున్నారు. 

2011 జనగణన డేటాను పరిగణనలోకి తీసుకొని ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేశామని, ఇప్పటి డేటాను తీసుకోలేమన్నది అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ వాదన. ఈ పిటిషన్లలో విచిత్రమైన వాస్తవాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసు కుంటే ఆయా ప్రాంతాల్లో ఎన్నికలు జరగకపోవడం సముచితం కాదు. వాటిని ద్విసభ్య ధర్మాసనం ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నాం’అని తీర్పు కాపీలో న్యాయమూర్తి స్పష్టం చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)