Breaking News

బీఆర్‌ఎస్‌ జనార్దన్ రెడ్డి ఇంట్లో ముగిసిన సోదాలు..

Published on Fri, 11/07/2025 - 10:41

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్న వేళ బీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లలో సోదాలు జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. తాజాగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు తనిఖీలు చేపట్టారు.

వివరాల ప్రకారం.. బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో శుక్రవారం ఉదయం ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరుపుతోంది. మోతీ నగర్‌లోని ఇంట్లో ఎన్నికల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 

ఈ క్రమంలో పోలీసులతో మర్రి జనార్థన్‌ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఈ సందర్బంగా మర్రి జనార్థన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘పోలీసులే నా ఇంట్లో డబ్బులు పెట్టించారు. పోలీసులే బ్యాగులను నా ఇంట్లోకి తీసుకెళ్లారు. కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు బహిరంగంగా డబ్బులు పంచుతున్నారు. డైవర్షన్‌ కోసమే మా ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ రౌడీయిజం చేస్తోంది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో రౌడీయిజమా?. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రౌడీయిజం చేస్తారని అనుకోలేదు’ అంటూ మండిపడ్డారు.

ఇక, తాజాగా మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు ముగిశాయి. దాదాపు ఐదు గంటల పాటు సోదాలు జరిపిన ఎన్నికల అధికారులు సోదాలపై పంచనామా రిపోర్ట్ సిద్ధం చేసి సంతకాలు తీసుకున్నారు. సోదాల సందర్భంగా ఆయన ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్.. అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఏసీలు కూడా పూర్తిగా ఓపెన్‌ చేసి చూశారు. ఓ లాకర్ ఉంటే వాటి తాళలు తెప్పించి మరీ సోదాలు జరిపారు. ఇంట్లో ఎలాంటి నగదు లభ్యం కాకపోవడం.. ఖాళీ చేతులతో వెనుదిరిగారు. 

మరోవైపు.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు నివాసంలో పోలీసుల తనిఖీలు చేపట్టారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బీఎస్పీ కాలనీలో ఉంటున్న ఎమ్మెల్సీ రవీందర్ రావు ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. అయితే, ఎలక్షన్ కోడ్ లేని ప్రాంతంలో ఉన్న తన ఇంట్లోకి పోలీసులు ఎలా వస్తారని ఎమ్మెల్సీ రవీందర్ రావు ప్రశ్నిస్తున్నారు. 

ఇక.. పోలీసుల సోదాల నేపథ్యంలో వారి ఇళ్ల వద్దకు భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.  పోలీసుల తీరుకు నిరసనగా ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. ఈ సందర్బంగా బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు మాట్లాడుతూ..మమ్మల్ని పోలీసులు బెదిరిస్తున్నారు. సోదాల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు. పోలీసులు కాంగ్రెస్‌ ఏజెంట్ల మాదిరిగా పనిచేస్తున్నారు. బహిరంగంగా రిగ్గింగ్‌ చేసుకోవడానికి  ప్రయత్నిస్తున్నారు. మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

జూబ్లీహిల్స్ ఎన్నిక వేళ.. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు