Breaking News

ఈసీ అసహనం.. దర్యాప్తు సంస్థలపై సీరియస్‌!

Published on Wed, 10/04/2023 - 08:13

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల వైఫల్యంతోనే మునుగోడు ఉపఎన్నికలో భారీగా డబ్బు, మద్యం పంపిణీ జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌ అయినట్లు తెలిసింది. ఇలా అయితే రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు ఎలా నిర్వహించాలని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో దర్యాప్తు సంస్థలన్నీ సమన్వయంతో వ్యవహరిస్తేనే ఎన్నికల్లో అక్రమాలను నిర్మూలించగలమని స్పష్టం చేసింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌తోపాటు ఎన్నికల కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్‌ గోయల్‌తో కూడిన బృందం మంగళవారం హైదరాబాద్‌లో 27 కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఈ భేటీలో రాష్ట్ర పోలీసు, ఆబ్కారీ శాఖలపై ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో ఆబ్కారీ శాఖ పట్టుకున్న మద్యాన్నే పోలీసు శాఖ పట్టుకున్నట్లు చూపడంపట్ల అభ్యంతరం తెలిపింది. మద్యం, గంజాయి అక్రమ రవాణా నియంత్రణలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించింది. 
చదవండి: స్వేచ్ఛాయుత ఎన్నికలకు వీలేది? ఈసీని నిలదీసిన విపక్షాలు

ఇకపై గట్టి నిఘా పెట్టాలి: ఎన్నికల్లో డబ్బు పంపిణీ, ఆన్‌లైన్‌ ద్వారా నగదు బదిలీ కట్టడికి  గట్టి నిఘా పెట్టాలని ఐటీ శాఖ, స్టేట్‌ జీఎస్టీ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ తదితర విభాగాలకు ఈసీ బృందం సూచించింది. డిజిటల్‌ లావాదేవీలను ఐటీ పరిధిలోకి తేవాలని...ఈ–వే బిల్లుల ఆధారంగా సరుకు రవాణాపై నిఘా పెట్టి కానుకల పంపిణీని అడ్డుకోవాలని, కాలం చెల్లిన వాహనాలు సీజ్‌ చేయాలని కోరింది.

ఈ భేటీలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌తోపాటు రాష్ట్ర పోలీసు శాఖ, కేంద్ర సాయుధ బలగాల నోడ ల్‌ అధికారి, ఆబ్కారీ, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్, ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ, ఆర్బీఐ, కస్టమ్స్, ఎస్జీఎస్టీ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్సీబీ, ఈడీ తదితర సంస్థల అధికారులు పాల్గొన్నారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)