Breaking News

పట్టించుకోని బిడ్డలకు మా ఆస్తులెందుకు?

Published on Tue, 09/24/2024 - 10:40

శాయంపేట: ఆస్తులు సంపాదించి ముగ్గురు కుమారులకు ఇచ్చాం. ఇళ్లు కట్టి ఇచ్చాం. వృద్ధాప్యంలో పట్టించుకోని బిడ్డలకు మా ఆస్తులు ఎందుకు? మా ఆస్తులు మాకు ఇప్పించండి.. అంటూ ఓ వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం శాయంపేట ఎంపీడీవో కార్యాలయంలో విలేకర్ల ముందు గోడు వెళ్లబోసుకున్నారు. 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామానికి చెందిన చెక్క చంద్రయ్య సారమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చంద్రయ్య హమాలీ పనిచేసి గ్రామంలో 10 ఎకరాల భూమి, పరకాల పట్టణంలో మూడు గుంటల స్థలాన్ని కొనుగోలు చేశాడు. ముగ్గురు కుమారులకు 2002లో మూడు ఎకరాల చొప్పున భూమిని పంచి ఇచ్చాడు. పరకాలలో మూడు గుంటల్లో కట్టిన ఇంటిని 2012లో సమానంగా పంచాడు.

 వృద్ధ దంపతులిద్దరు గ్రామంలో ఓ షెడ్డు వేసుకొని అందులో ఉంటున్నారు. వృద్ధాప్యం మీద పడడంతో తమ ఆరోగ్యాలు సరిగ్గా లేవని, ఏ కుమారుడు కూడా పట్టించుకోవడం లేదని చెక్క చంద్రయ్య, సారమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కుమారులు పట్టించుకోకపోవడంతో జూలై 7న పోలీస్‌స్టేషన్‌లో, 8న పరకాల ఏసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు చంద్రయ్య తెలిపారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో సోమవారం కలెక్టర్‌ ప్రావీణ్యకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)