Breaking News

రీల్స్‌ కోసం.. బైకుపై ఎనిమిది మంది

Published on Tue, 06/24/2025 - 08:47

హైదరాబాద్: ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా ఎనిమిది మంది యువకులు ఓ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనంపై అర్ధరాత్రి రీల్స్‌ కోసం స్టంట్‌ చేశారు. జాతీయ రహదారిపై ఈ స్టంట్‌ కొనసాగుతుండటంతో ఈ దారి గుండా వెళ్తున్న వారు తమ సెల్‌ఫోన్‌లో బంధించి ఎక్స్‌ వేదికగా పోస్టు చేసి..సైబరాబాద్‌ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపిన వివరాల ప్రకారం..

ఈ నెల 21న అర్థరాత్రి 1.30 గంటల సమయంలో శంషాబాద్‌ ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది యువకులు ద్విచక్ర వాహనంపై శంషాబాద్‌ నుంచి ఆరాంఘర్‌ వైపు పయనమయ్యారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు మైనర్లతో పాటు ఐదుగురు యువకులు పయనిస్తూ రీల్స్‌ చేశారు. ప్రమాదభరితంగా స్టంట్‌లు చేశారు. ఈ దృశ్యాలను అటుగా వెళుతున్న పలువురు చిత్రీకరించి ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు వెళ్లే ఈ రహదారి రాత్రి సమయాల్లో బిజీగా ఉంటుంది. 

అర్ధరాత్రి సమయంలో వీఐపీల రాకపోకలతో అలర్ట్‌గా ఉంటుంది. ఈ స్టంట్‌ విషయమై పలువురు సైబరాబాద్‌ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. సైబరాబాద్‌ పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను సోమవారం గుర్తించారు. ద్విచక్ర వాహనంతో పాటు ఐదుగురు యువకులను, ముగ్గురు మైనర్లను రాజేంద్రనగర్‌ పోలీసులకు సోమవారం సాయంత్రం అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)