Breaking News

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు కలకలం.. 15 బృందాలతో దాడులు

Published on Tue, 08/01/2023 - 09:32

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో మరోసారి ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో మంగళవారం(ఆగస్టు1) ఉదయం నుంచే దాడులు జరుపుతోంది. మాలినేని సాంబశివరావుతో పాటు పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 15 బృందాలతో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.

కాగా మాలినేని సాంబశివరావు  నాలుగు కంపెనీలకు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ట్రాన్స్‌ ట్రై పవర్ ప్రాజెక్ట్, టెక్నో యూనిట్ ఇన్ఫ్రా టెక్, కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్, ట్రాన్స్ ట్రై రోడ్డు ప్రాజెక్ట్‌లకు డైరెక్టర్‌గా ఉన్నారు.

ఇదిలా ఉండగా 2020 జనవరిలో మలినేని సాంబశివరావు కంపెనీపై సీబీఐ దాడులు జరిపింది.  ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ నుంచి ట్రాన్స్ ట్రాయ్ సింగపూర్ లిమిటెడ్‌కు నిధులు బదిలీ అయ్యాయన్న ఆరోపణలతో సోదాలు జరిపింది.  దీంతో మనీలాండరింగ్ జరిగినట్టు ఈడి అభియోగం మోపింది. యూనియన్ బ్యాంక్ నుండి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రూ. 300 కోట్ల రూపాయల రుణాలు పొందగా.. తిరిగి  ఆ రుణాలు చెల్లించకపోవడంపై సీబీఐ కేసు నమోదు చేసింది.

రూ. 260 కోట్ల రూపాయలను ఇతర కంపెనీకి మళ్ళీ ఇచ్చినట్టు సీబీఐ గుర్తించింది. లోన్ కోసం తీసుకున్న డబ్బులను బంగారం, వెండి ఆభరణాలకు ఖర్చు చేశారంటూ ఆరోపించింది. 2013లో ట్రాన్స్ ట్రాయ్‌ను కెనరా బ్యాంక్‌ ఆడిట్ చేసింది. అప్పటినుంచి బ్యాంక్‌ల లిస్ట్‌లో నాన్ పర్ఫామింగ్ అసెట్‌గా మారింది  ట్రాన్స్ ట్రాయ్. ఇక ఇదే కంపెనీకి మలినేని సాంబశివరావు డైరెక్టర్‌గా ఉన్నారు. 
చదవండి: సీఎం కేసీఆర్‌ ప్రజలనే కాదు, రాముడినీ మోసం చేశారు: భట్టి

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)