Breaking News

కవిత భర్త అనిల్‌కు ఈడీ నోటీసులు

Published on Sat, 03/16/2024 - 18:24

సాక్షి, హైదరాబాద్‌: కవిత భర్త అనిల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. కవిత పీఆర్వో రాజేష్‌,ముగ్గురు అసిస్టెంట్లకు కూడా నోటీసులిచ్చింది. సోమవారం హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. నిన్న కవిత ఇంట్లో సోదాలు చేస్తున్న సమయంలో ఐదుగురు సెల్‌ఫోన్లు ఈడీ అధికారులు సీజ్‌ చేశారు.

కాగా, లిక్కర్‌ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రిమాండ్‌ విధించింది రౌస్‌ అవెన్యూ కోర్టు. అలాగే ఏడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. అరెస్టు అక్రమమని కవిత తరఫు లాయర్ల వాదనను కోర్టు తిరస్కరించింది.

ఈ క్రమంలో రిమాండ్‌ విధిస్తూ.. ఈ నెల 23న మధ్యాహ్నాం 12 గంటలకు కవితను తిరిగి హాజరు పరచాలని ఈడీని ఆదేశించింది. అలాగే రిమాండ్‌లో కుటుంబ సభ్యులు,  న్యాయవాదులను కలిసేందుకు కవితకు అవకాశం కల్పిస్తూనే.. ఇంటి భోజనానికి కోర్టు అనుమతించింది.

కవిత కస్టడీ రిపోర్టులో ఏముందంటే? 

  • ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కవిత కీలకంగా ఉన్నారు
  • సౌత్‌ లాబీ పేరుతో లిక్కర్‌ స్కాంలో కీలకంగా వ్యవహరించారు
  • ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక కుట్ర దారు, ప్రధాన లబ్ధిదారు కవితే
  • ఆమ్‌ అద్మీ పార్టీకి కవిత లిక్కర్‌ స్కాం ముడుపుల కింద వంద కోట్లు ఇచ్చారు
  • మాగుంట శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రకు పాల్పడ్డారు
  • కవితకు బినామీగా రామచంద్ర పిళ్లై ఉన్నారు
  • పిళ్లై ద్వారా కవిత మొత్తం వ్యవహారం నడిపించారు
  • అరుణ్ పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో.. కవిత వాటా పొందారు
  • ఇతరులతో కలిసి 100 కోట్ల రూపాయల లంచాలను ఆప్ నేతలకు కవిత ఇచ్చారు
  • కేసు నుంచి తప్పించుకునేందుకు కవిత తన మొబైల్ లోని ఆధారాలు తొలగించారు
  • సౌత్ గ్రూప్ లోని శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ మాగుంటతో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రలు పన్నారు
  • మాగుంట ద్వారా రూ. 30 కోట్లను కవిత ఢిల్లీకి చేర్చారు
  • రూ. 30 కోట్లను అభిషేక్‌ బోయినపల్లి ఢిల్లీకి తీసుకెళ్లాడు అని ఈడీ పేర్కొంది.

ఇదీ చదవండి: కవిత రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)