Breaking News

ఇంటర్నేషనల్‌ డ్రగ్స్‌ దందా కేసులో రూ.7.98 కోట్ల ఆస్తులు జప్తు

Published on Thu, 02/27/2025 - 04:53

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్నేషనల్‌ డ్రగ్స్‌ దందా కేసులో రూ.7.98 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల మేరకు చేపట్టిన ఈ తాత్కాలిక జప్తులో 22 స్థిర, 8 చరాస్తులున్నాయి. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో నిందితుడు ఆశిష్‌ జైన్, అతని కుటుంబ సభ్యుల పేరుపై ఉన్న రూ.6.52 కోట్ల విలువైన భూములు, రూ.1.46 కోట్ల బ్యాంక్‌ బ్యాలెన్స్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు సీజ్‌ చేసినట్లు ఈడీ బుధవారం పేర్కొంది. 

హైదరాబాద్‌ దోమలగూడలోని జేఆర్‌ ఇన్ఫినిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఆశిష్‌ జైన్‌ డ్రగ్స్‌ దందా నడుపుతున్నట్లు 2022లో ఎన్సీబీ అధికారులు గుర్తించారు. ఆశిష్‌ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించి, రూ.3.72 కోట్ల నగదుతో పాటు ల్యాప్‌టాప్, మొబైల్‌ ఫోన్, ఇతర ఎల్రక్టానిక్‌ గాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నారు. 2022, మే 4న ఎన్సీబీ కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. జేఆర్‌ ఇన్ఫినిటీ, ఆశిష్‌ జైన్, అతని కుటుంబ సభ్యులపై దర్యాప్తు ప్రారంభించింది. 

హైదరాబాద్‌లోని ఇంటర్నెట్‌ ఫార్మసీ ద్వారా అమెరికా తదితర దేశాలకు ఫార్మా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు గుర్తించింది. ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా రహస్యంగా కంపెనీ ఆన్‌లైన్‌లో ఫార్మా మందులతో పాటు జేఆర్‌ ఇన్ఫినిటీ పేరుతో అక్రమ దందా నడుపుతున్నట్లు తెలుసుకుంది. మెయిల్స్, వీఓఐపీ ద్వారా కస్టమర్ల నుంచి ఆర్డర్స్‌ తీసుకుని డ్రగ్స్‌ సరఫరా చేసేవారని, క్రెడిట్‌ కార్డు, బిట్‌ కాయిన్స్‌ ద్వారా చెల్లింపులు కొనసాగుతున్నాయని గ్రహించింది. 

అ్రల్ఫాజోలం, జోల్పిడెమ్, లోరాజెపామ్, క్లోనాజెపామ్, హైడ్రోకోడోన్, ఆక్సికోడోన్‌ తదితర సైకోట్రోపిక్‌ పదార్థాలను ట్యాబ్లెట్ల రూపంలో చట్టవిరుద్ధంగా ఎగుమతి చేస్తున్నారని విచారణలో తేలింది. జేఆర్‌ ఇన్ఫినిటీ ఏర్పాటుకు ముందే ఆశిష్‌జైన్, అతని కుటుంబ సభ్యుల బ్యాంక్‌ ఖాతాల్లో రూ.4.50 కోట్లు విదేశాల నుంచి వచి్చనట్లు తేల్చారు. ఇలా రూ.12.76 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు, స్థిరాస్తుల కొనుగోలుకు వె చ్చించినట్లు ఈడీ పేర్కొంది.  

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)