చంద్రయాన్‌–3లో ఈసీఐఎల్‌ కీలక భూమిక

Published on Fri, 08/25/2023 - 01:13

కుషాయిగూడ (హైదరాబాద్‌): చంద్రయాన్‌–3లో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎల్రక్టానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) కీలక భూమిక పోషించింది. చంద్రయాన్‌ కమ్యూనికేషన్‌కు కీలకమైన 32 మీటర్‌ డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ (డీఎస్‌ఎన్‌) యాంటెన్నాను సరఫరా చేసిందని   సంస్థ వర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి.

300 టన్నుల ఈ యాంటెన్నా వ్యవస్థను బాబా అటామిక్‌ రీసెర్చ్, యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్, ఐఎస్‌టీఆర్‌ఏసీలతో కలిసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినట్లు చెప్పాయి. చంద్రుడి ఉపరితలంపై 0.3 మిల్లీమీటర్ల పరిమాణం కలిగిన వాటినీ క్షుణ్ణంగా చూపించేలా వీల్‌ అండ్‌ ట్రాక్‌ మౌంట్, బీమ్‌ వేవ్‌ గైడ్, ఫీడ్‌ సిస్టమ్‌తో కూడిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యాంటెన్నాలో అమర్చినట్లు చెప్పాయి.

చంద్రుడిపై తీసే చిత్రాలు, డేటాను స్వాదీనం చేసుకోవడంలోనూ ఈ యాంటెన్నా కీలక పాత్ర పోషిస్తుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన యాంటెన్నా సిస్టమ్‌తో పాటుగా సేఫ్‌ అండ్‌ సెక్యూర్‌ ప్రోగ్రామబుల్‌ లాజిక్‌ కంట్రోల్‌ (పీఎల్‌సీ)ని అందిస్తూ ఇస్రోతో ఈసీఐఎల్‌ సన్నిహితంగా పనిచేస్తోందని ఆ వర్గాలు చెప్పాయి. రాబోయే ఆదిత్య, గగన్‌యాన్, మంగళ్‌యాన్‌–2 మిషన్లకు కూడా ఈసీఐఎల్‌ పనిచేస్తుందని పేర్కొన్నాయి. 
 

Videos

30 వేల పెన్షన్ రావాల్సింది.. 13 వేలు ఇస్తున్నారు

మెటా తో లోకేష్ కుమ్మక్కు... సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్...

తలుపులేసుకుని తొడకొట్టే హీరో... మొత్తం గీసుకొని మీసం మెలేసే మొనగాడు..!

నడుములోతు నీళ్లలో లగ్గం.. వరదైనా తగ్గేదేలే అంటున్న జంట

చరిత్ర సృష్టించిన రష్మిక

DSCలో అవినీతి బట్టబయలు..! లోకేష్ రాజీనామా..?

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

Photos

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)