Breaking News

కాకరేపుతున్న కామెంట్స్‌.. ఈటల వార్నింగ్‌!

Published on Mon, 04/14/2025 - 17:28

సాక్షి, హైద‌రాబాద్‌: తెలంగాణ‌ రాష్ట్రవ్యాప్తంగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ అధినాయకత్వం ప్రయత్నిస్తుండగా, మరోవైపు కొందరు పదవులు దక్కిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే అసంతృప్తి శ్రేణుల్లో నెలకొంది. గ్రేటర్‌ హైద‌రాబాద్‌ (Greater Hyderabad) పరిధిలో కొత్తగా ఎన్నికైన డివిజన్‌ అధ్యక్షుల వ్యవహార శైలిపై పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరో ఏడాదిలో గ్రేటర్‌ ఎన్నికలు ఉన్నాయి. అప్పటి వరకు పార్టీ పరంగా గ్రౌండ్‌ వర్క్‌ (Ground Work) చేసుకోవాలని దిశానిర్దేశం చేస్తున్నారు. డివిజన్, జిల్లాలవారీగా విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ బలాబలాలు, సరిదిద్దుకోవాల్సిన అంశాలపైనా చర్చిస్తున్నారు. ఇలాంటి సమంలో పార్టీ పదవుల్లో ఉన్నవారు సమావేశాలకు గైర్హాజర్‌ కావడమేంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారే పార్టీ పదవుల్లో కొనసాగాలని, అలా కుదరదంటే స్వచ్ఛందంగా తప్పుకోవాలనే వాదలు గట్టిగా వినిపిస్తున్నారు.

ఇటీవల కాషాయ పార్టీ మీటింగ్‌లో స్థానిక ఎంపీ ఈటల రాజేందర్‌ (Eatala Rajender ) సైతం ఇదే స్వరాన్ని వినిపించారు. మేడ్చల్‌ అర్బన్‌ జిల్లాలో బీజేపీ 25 డివిజన్లుగా విభజించింది. కొత్తగా డివిజన్‌ అధ్యక్షులను ఎంపిక చేసింది. అనంతరం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి కొత్తగా ఏర్పాటైన వారిలో 9 మంది డివిజన్‌ అధ్యక్షులు హాజరు కాలేదు. దీంతో ఒకింత ఆగ్రహానికి గురైన ఈటల రాజేంద‌ర్‌ 70 వేల మందికి ప్రాతినిథ్యం వహించే డివిజన్‌ అధ్యక్షుడు పార్టీ సమావేశాలకు హాజరు కాకుంటే ఎలా, అత్యవసర పరిస్థితుల్లో రాలేనివారిని మినహాయిస్తే, మిగతావారిని ఊపేక్షించేది లేదంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

చ‌ద‌వండి: వారి మ‌ద్ద‌తుతోనే ఈ న‌ల్ల చ‌ట్టాన్ని తెచ్చారు

దీంతో పార్టీలో ఆ 9 మంది డివిజన్‌ అధ్యక్షుల భవితవ్యం ఏంటనే చర్చ జరుగుతోంది. భాగ్యనగరంలోని మిగతా డివిజన్ల పరిస్థితిపైనా నిశితంగా పరిశీలించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నవారిని పక్కన పెట్టి పార్టీకి పనిచేసే వారికి పట్టం గట్టాలని పార్టీ అధిష్టానం (High Command) భావిస్తోందని నేతలు పేర్కొంటున్నారు. నేతలు సొంత పార్టీ వారే అయినా కొన్ని దఫాలు కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందంటున్నారు. పదవి పొందేటప్పుడు ఉన్న ఆరాటం ఆ తర్వాత ఉండటం లేదని, పార్టీ కోసం 24 గంటలు పని చేయాల్సిందేనని పార్టీ అధిష్టానం స్పష్టం చేస్తోంది.   

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)