Breaking News

బాచుపల్లి మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్‌ కలకలం

Published on Tue, 08/26/2025 - 15:28

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో విద్యాసంస్థల్లోకి మత్తు భూతం చొరబడిపోయింది. బాచుపల్లి మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్‌ కలకలం సృష్టించింది. డ్రగ్స్‌ తీసుకుంటున్న విద్యార్థులను ఈగల్‌ టీం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇద్దరు విద్యార్థులతో సహా మొత్తం  నలుగురిని నార్కోటిక్‌ బ్యూరో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మత్తుకు బానిసలైన మరో 50 మంది విద్యార్థులను విచారించేందుకు సిద్ధమైంది. 

బహదూర్‌పల్లి బాచుపల్లి మహీంద్రా యూనివర్సిటీలో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్‌, గంజాయి దందా నడుస్తోంది. ఈ సమాచారంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్ విభాగం మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. గంజాయి సేవిస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. ఈ క్రమంలో షాకింగ్‌ విషయాలు బయటపడ్డాయి. 

మణిపూర్‌కు చెందిన ఓ విద్యార్థిని ఢిల్లీకి చెందిన ఓ ముఠా నుంచి కొరియర్‌ ద్వారా ఓజీ కుష్‌ డ్రగ్‌ను తెప్పించుకుంటున్నాడు. దానిని గంజాయితో కలిపి సిగరెట్లు తయారు చేసి మిగతా స్టూడెంట్స్‌కు విక్రయిస్తున్నాడు. దీంతో సదరు విద్యార్థిని మరో విద్యార్థితో పాటు ఇద్దరు డగ్ర్‌ పెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల నుంచి కిలోకి పైగా గంజాయి, 47 ఓజీ కుష్‌ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. యూనివర్సిటీలో  కొంతమంది విద్యార్థులు వీటికి బానిసలైనట్లు గుర్తించారు. ఈ పరిణామంపై కాలేజీ యాజమాన్యం స్పందించాల్సి ఉంది.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)