Breaking News

అరేయ్‌.. మీరంతా ఎవర్రా.. నా చెల్లిని తీసుకుపోవడానికి..!

Published on Sat, 08/16/2025 - 12:39

హైదరాబాద్: మద్యం మత్తులో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీవ్రంగా కొట్టిన ఘటనలో ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలివీ... జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–10లోని స్రవంతినగర్‌లో గంగోల శ్రీనివాసులు (29) అనే యువకుడు సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో శ్రీనివాసులు తనతో పనిచేస్తున్న కిరణ్, శ్రీనిజ, వెంకటేష్ , మహేష్, పవన్, సుభాష్‌ తదితరులతో కలిసి మూసాపేట చంద్రకళ థియేటర్‌లో కూలీ సినిమా చూసి రాత్రి 1.30 గంటల ప్రాంతంలో తిరిగి వెంకటగిరికి వచ్చి శ్రీనిజను ఆమె ఇంటి వద్ద డ్రాప్‌ చేశారు. అదే సమయంలో ఇద్దరు యువకులు అక్కడికి వచ్చి మద్యం మత్తులో తూలుతూ శ్రీనివాసులును ఉద్దేశించి అరేయ్‌.. మీరంతా ఎవర్రా.. నా చెల్లిని తీసుకుపోవడానికి మీరెవరు..అంటూ కొట్టాడు. అసభ్య పదజాలంతో దూషించాడు. అడ్డుకోవడానికి యతి్నంచిన శ్రీనివాసులు స్నేహితుడిని కూడా కొట్టారు. 

నువ్వు కారు ఎక్కు.. నీతో పని ఉంది అంటూ బలవంతంగా కారు ఎక్కించుకుని 10 నిమిషాల పాటు హైలంకాలనీ ఏరియాలో తిప్పారు. ఓ వైన్‌ షాపు ముందు ఆపి తమతో పాటు తెచ్చుకున్న బీర్లు తాగుతూ రేవంత్‌తో పాటు ఆయన స్నేహితుడు విశాల్‌.. శ్రీనివాసులును తీవ్రంగా కొట్టారు. అడ్డువచ్చిన కిరణ్‌ను కూడా తీవ్రంగా బాదారు. మళ్లీ కారు ఎక్కించుకుని శ్రీనివాసులుతో పాటు ఆయన స్నేహితుడు కిరణ్‌ను మళ్లీ యూసుఫ్‌గూడ ఫస్ట్‌ బెటాలియన్‌ వైపు తీసుకువెళ్లారు. అదే సమయంలో పెట్రోలింగ్‌ పోలీసు వాహనం అటువైపు రావడంతో వీరిద్దరూ బిగ్గరగా అరిచి పోలీసులను అప్రమత్తం చేశారు. స్పందించిన పోలీసులు కారును ఆపి నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

 వీరిద్దరికీ డ్రంకన్‌ డ్రైవ్‌ నిర్వహించగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు నిర్థారణ అయ్యింది. దర్యాప్తులో నిందితుడు తొక్కుడుబియ్యపు రేవంత్‌ (27) యూసుఫ్‌గూడ ఫస్ట్‌ బెటాలియన్‌లో నివసిస్తుంటాడని, తండ్రి పోలీసు చనిపోవడంతో కారుణ్య నియామకం కింద ఆయనకు చాంద్రాయణగుట్ట బ్రాంచ్‌ పింఛన్‌ ఆఫీసులో సబార్డినేట్‌ పోస్టు వచి్చనట్లు తేలింది. ఆయన స్నేహితుడు నారగాని విశాల్‌ శ్రీనగర్‌కాలనీలో నివసిస్తుండగా ఓ కారు షోరూంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నట్లు తేలింది. వీరి అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)