Breaking News

హైదరాబాద్ నడిరోడ్డుపై దుశ్శసన పర్వం..

Published on Tue, 08/08/2023 - 07:24

హైదరాబాద్: మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న  యువతిని వివస్త్రను చేసి, దాడికి పాల్పడిన ఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కుషాయిగూడ ఏసీపీ వెంకట్‌రెడ్డి, జవహర్‌నగర్‌ డీఐ శ్రీనివాస్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీనగర్‌ శివాజీనగర్‌కు చెందిన పెద్ద మారయ్య (30)కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసగా మారి భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. 

ఆదివారం రాత్రి మద్యం మత్తులో భార్యతో గొడవ పడిన మారయ్య తన తల్లితో కలిసి బాలాజీనగర్‌ డివైడర్‌ మార్గంలో రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో షాపింగ్‌కు వెళ్లి వస్తున్న ఓ యువతి (28)పై దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆమె మారయ్య చెంప చెళ్లుమనిపించింది. దీంతో అతను కోపంతో ఆమెపై దాడి చేసి దుస్తులు లాగి వివస్త్రను చేశాడు. పక్కనే ఉన్న మారయ్య తల్లి కుమారుడిని వారించలేదు. 

అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ మహిళ అడ్డుకోగా ఆమెపై కూడా దాడి చేశాడు. కొద్దిసేపటి తర్వాత పలువురు మహిళలు వచ్చి ఆమెపై కవర్లను కప్పారు. నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేస్తుంటే స్థానికులు సెల్‌ఫోన్లలో వీడియోలు తీశారు తప్ప అడ్డుకోలేదని పలువురు మండిపడుతున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)