Breaking News

మద్యం మత్తులో ఆటో డ్రైవర్ హంగామా.. పోలీసులపై పాము

Published on Sun, 01/04/2026 - 13:32

హైదరాబాద్‌: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఓ ఆటో డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులపై పాము విసిరేందుకు ప్రయత్నించిన ఘటన పాతబస్తీ చంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద కలకలం రేపింది. మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడన్న అనుమానంతో ట్రాఫిక్ పోలీసులు ఆటోను ఆపి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో డ్రైవర్‌కు 150 రీడింగ్ రావడంతో ఆటోను సీజ్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

ఈ సమయంలో మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ఒక్కసారిగా ఆటోలో నుంచి పామును తీసి పోలీసులపైకి విసిరే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు భయాందోళనకు గురై వెంటనే దూరం తప్పుకున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న ఆటో డ్రైవర్ పాముతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు.

ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల విధుల నిర్వహణకు ఆటంకం కలిగించడం, ప్రజల ప్రాణాలకు ముప్పుగా వ్యవహరించినందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)