Breaking News

మహిళ ఇంట్లో డ్రగ్స్‌ పట్టివేత

Published on Thu, 10/31/2024 - 09:07

సాక్షి, హైదరాబాద్‌: ఓ మహిళ తన ఇంట్లో డ్రగ్స్‌ను ఎలాంటి అనుమతులు లేకుండా దాచిపెట్టి నగరంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్న వ్యవహారాన్ని రాష్ట్ర డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్, ఎక్సైజ్‌ విభాగం బట్టబయలు చేశాయి. బుధవారం సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్‌ బజార్‌లో ఉన్న జీవీ సలూజా హాస్పిటల్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు. తనిఖీల సందర్భంగా భారీ స్థాయిలో అక్రమంగా నిల్వ ఉంచిన నార్కోటిక్స్‌ డ్రగ్స్‌తో పాటు మత్తు కలిగించే మందులను గుర్తించారు. 

ఫెంటనైల్, కిటమైన్‌ హైడ్రోక్లోరైడ్, పెంటజోసైన్‌ యాసిడ్, మిడజోలం, సక్సినైల్‌ క్లోరైడ్‌ ఇంజెక్షన్లను భారీగా పట్టుకున్నారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారించగా.. మౌలాలిలోని ఎంజే కాలనీకి చెందిన నేహా భగవత్‌ అనే మహిళ తమకు సరఫరా చేస్తుందని వివరాలు అందించారు. దీంతో వెంటనే నేహా ఇంటికి వెళ్లిన అధికారులు అక్కడ భారీ స్థాయిలో నిల్వ ఉంచిన నార్కోటిక్‌ డ్రగ్స్, మందులను గుర్తించారు. 

మార్ఫిన్‌ ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు, ఫెంటనైల్‌ సిట్రేట్‌ ఇంజెక్షన్లు, ఫెంటనైల్‌ సిట్రేట్‌ ప్యాకెట్లు, పెంటజోకైన్‌ ఇంజెక్షన్లను వేరే రాష్ట్రాల నుంచి అక్రమంగా కొనుగోలు చేసి, నగరంలో లైసెన్స్‌ లేకుండా అక్రమంగా నడుపుతున్న మందుల దుకాణాలకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఇప్పటికే నేహాపై ఎన్డీపీఎస్‌ చట్టం కింద రెండు కేసులు ఉన్నాయని, గత నెలలోనే బెయిల్‌ పొంది బయటికి వచ్చినట్టు అధికారులు వివరించారు. అధికారులు డ్రగ్స్‌ను సీజ్‌ చేశారు. నేహా భగవత్, పట్టూరి గోపీనాథ్, సురేందర్‌సింగ్‌ గుసియాలు పట్టుబడ్డారు. కాగా, నిందితులైన రాజేందర్‌ సింగ్‌ సలూజా, అమృత సింగ్‌ సలూజా, దినేశ్‌ పరారీలో ఉన్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)