Breaking News

తనిఖీల జప్తులో తెలంగాణ టాప్‌.. ఏకంగా 659 కోట్ల స్వాధీనం

Published on Tue, 11/21/2023 - 07:56

సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి జరుగుతున్న తనిఖీల్లో పట్టుబడ్డ సొమ్ము జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా చేస్తున్న తనిఖీల్లో రూ.1,760 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తెలిపింది. 2018లో స్వాధీనం చేసుకున్న రూ.239.15 కోట్లతో పోలిస్తే ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న సంపద 7 రెట్లు ఎక్కువ అని పేర్కొంది.

సోమవారం వరకు తెలంగాణలో రూ.225.23 కోట్ల నగదు, రూ.86.82 కోట్ల విలువైన మద్యం, రూ.103.74 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.191.02 కోట్ల విలువైన బంగారం సహా విలువైన లోహాలు, రూ.52.41 కోట్ల విలువైన ఉచితాలకు సంబంధించిన వస్తువులతో కలిపి మొత్తం రూ.659.20 కోట్ల విలువైన సంపదను పట్టుకున్నట్లు సీఈసీ వెల్లడించింది. అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉచితాలు మినహా నగదు, మద్యం, డ్రగ్స్, బంగారంలో రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలతో పోలిస్తే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.

రాజస్తాన్‌లో రూ.650.70 కోట్లు, మధ్యప్రదేశ్‌లో రూ.323.70 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌లో రూ.76.9 కోట్లు, మిజోరంలో రూ.49.6 కోట్లు పట్టుబడినట్లు ఈసీ తెలిపింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు వినియోగించే ఉచితాలకు సంబంధించిన వస్తువుల జప్తు రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో అధికంగా ఉంది. రాజస్తాన్‌లో రూ.341.24 కోట్లు, మధ్యప్రదేశ్‌లో రూ.120.53 కోట్ల విలువైన ఉచితాలను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. ఈసారి ఎలక్షన్‌ సీజర్‌ మేనేజ్‌మెంట్‌ విధానం.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని సులభతరం చేసిందని ఈసీ పేర్కొంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)