Breaking News

మస్తాన్‌ సాయి అరెస్ట్‌తో కదులుతున్న డ్రగ్స్‌ డొంక

Published on Tue, 08/13/2024 - 16:44

సాక్షి, హైదరాబాద్‌: డ్రగ్‌ పెడ్లర్‌ రావి మస్తాన్‌ సాయి కేసులో సంచనల విషయాలు వెలుగుచూస్తున్నాయి. గుంటూరుకు చెందిన మస్తాన్‌ సాయి అరెస్ట్‌తో  డ్రగ్స్‌ డొంక కదులుతోంది. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ సరఫరా, కస్టమర్ల వ్యవహారంపై పోలీసుల ఆరా తీస్తున్నారు. తాజాగా మస్తాన్‌ సాయి స్నేహితురాలు ప్రీతి వ్యవహారం బయటకొచ్చింది. 

ప్రీతి, ఉదయ్‌ డ్రగ్స్‌ తీసుకుంటున్న వీడియోలు బయటపడ్డాయి. అమ్మాయితో మస్తాన్‌సాయి అసభ్యంగా ఫొటోలు, వీడియోలు రికార్డు చేసినట్లు తేలింది. డ్రగ్స్‌, గంజాయి సేవిస్తున్న సమయంలో ప్రీతి, ఉదయ్‌ వీడియోలు తీసుకోగా.. డ్రగ్స్‌ కవాలి, తీసుకురావలిన వాట్పాప్‌లో ప్రీతి చాటింగ్‌ చేసినట్లు వెల్లడైంది.

కాగా గుంటూరులో సోమవారం రావి మస్తాన్‌ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం అతడికి హైదరాబాద్‌ తీసుకొచ్చి విచారిస్తున్నారు.  ఈ క్రమంలో ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పించి హైదరాబాద్, గుంటూరు, విజయవాడల్లో సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సాయి సెల్ ఫోన్లో భారీగా పలువురు యువతుల ప్రైవేటు వీడియోలు, ఫొటోలు ఉన్నట్లు సమాచారం. వాటిని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. 

మస్తాన్ సాయి తండ్రి రావి రామ్మోహనరావు గుంటూరులోని మస్తానయ్య దర్గాకు వంశపారంపర్య ధర్మకర్తగా ఉన్నారు. వీరి కుటుంబానికి ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలు అడ్డుపెట్టుని మస్తాన్ సాయి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.

గతంలోనూ అతడిపై డ్రగ్స్‌ కేసులు ఉన్నాయి. కాగా కొద్ది నెలల క్రితం హైదరాబాద్​లో  డ్రగ్స్ పట్టుబడిన వ్యవహారంలో కూడా మస్తాన్ సాయి పేరును ఎఫ్ఐఆర్​లో చేర్చారు. అప్పట్లో హైదరాబాద్ పోలీసులు కొందరిని అరెస్టు చేయగా..వారిలో వరలక్ష్మి టిఫిన్స్ నిర్వాహకుడు కూడా ఉన్నారు. వారితో కలిసే మస్తాన్ సాయి డ్రగ్స్ వ్యవహారాలు నడిపేవారని తేలింది. 

జూన్‌ 3న విజయవాడ రైల్వే స్టేషన్‌లో డ్రగ్స్‌ తరలిస్తుండగా సెబ్‌ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలోనూ మస్తాన్‌సాయి పోలీసుల నుంచి తప్పించుకుపోయాడు. అప్పటి నుంచి పోలీసులకు పట్టుబడకుండా తిరుగుతున్నాడు. ఎట్టకేలకు ఇప్పుడు పోలీసులకు చిక్కాడు.  సినీ హీరో రాజ్‌ తరుణ్, లావణ్య కేసులో మస్తాన్‌సాయి పేరు వెలుగులోకి వచ్చింది.

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)