Breaking News

మోదీ ఫొటో పెట్టాలనడం సరికాదు

Published on Wed, 04/02/2025 - 04:19

సాక్షి, యాదాద్రి, కనగల్‌: రేషన్‌ దుకాణాల్లో నరేంద్రమోదీ ఫొటో పెట్టాలని బండి సంజయ్‌ జోక్‌ చేస్తున్నాడని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నా­రు. కేంద్రం ఏం ఇస్తుందని ప్రధాని ఫొటో రేషన్‌ దుకాణాల్లో పెట్టాలని ఆయన ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో, నల్లగొండ జిల్లా కనగల్‌ మండలం జి.ఎడవల్లి గ్రామంలో మంగళవారం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో నిర్మించారని, అందులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వాటా 13 శాతం ఉందన్నారు. మరి ఎయిర్‌పోర్టులో తెలంగాణ సీఎం ఫొటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. బండి సంజయ్‌ చిల్లర రాజకీయం మానుకోవాలని హితవుప­లికారు. రాష్ట్రాల సముదాయమే కేంద్రమని, రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయంతోనే కేంద్రం నడుస్తుందన్నారు. 

కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం రూపాయి ఇస్తే.. 42 పైసలే వాపస్‌ ఇస్తున్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాలకు రూపాయి ఇస్తే.. 7 రూపాయలు తిరిగి ఇస్తున్నారని.. బండి సంజయ్‌ ఇది తెలుసుకోవాలన్నారు. 

సన్న బియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుంది..
సన్న బియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవమని, ఇది చరిత్రలో నిలిచిపోయే పథకమని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్‌ కార్డు కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డులు ఇస్తోందని, 20 లక్షల మంది పేర్లు రేషన్‌ కార్డులలో చేర్పించామని చెప్పారు. 

రూ.3 కోట్ల పది లక్షల మందికి సన్నబియ్యం ఇవ్వనున్నామని, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, నల్లగొండ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, భువనగిరి కలెక్టర్‌ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)