Breaking News

ధనిక్‌ భారత్‌ యాజమాన్యానికి భారీ షాక్‌! షోకాజ్‌ నోటీసులు

Published on Sat, 07/25/2026 - 11:23

సాక్షి, హైదరాబాద్‌: ధనిక్ భారత్ జూనియర్ కాలేజీ వివాదంలో ఇంటర్ బోర్డు   సీరియస్‌గా స్పందించింది. అనుమతులు లేకున్నా ఇంటర్ అడ్మిషన్లను చేపడుతోందంటూ సీజేఎస్ వరుస ఆరోపణల నేపథ్యంలో ఆ కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై తక్షణమే వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్టు    రంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (DIEO)  ఎం.ఏ.ఎంక్యా ఒక ప్రకటనలో తెలిపారు.

గ్రేటర్ పరిధిలోని మదీనాగూడ, కూకట్ పల్లి, ఎల్బీనగర్, బొంగుళూరు రెసిడెన్షియల్ క్యాంపస్, మాదాపూర్ రెసిడెన్షియల్ క్యాంపస్ బాయ్స్, గర్ల్స్ క్యాంపస్లలో ధనిక్ భారత్ పేరిట నడుస్తున్న ఏడు బ్రాంచీలలో ఒక్క బ్రాంచ్కీ కూడా ఇంటర్మీడియట్ బోర్డు నుండి ఎలాంటి అధికారిక అనుమతులు లేవని అధికారులు నిర్ధారించారు. కనీస నిబంధనలు పాటిం చకుండా, బోర్డు అనుమతి లేకుండా విద్యార్థులను చేర్చుకోవడంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

అనుమతులు లేకుండా కాలేజీలను ఎలా నిర్వ హిస్తున్నారో వివరణ ఇవ్వాలని కోరుతూ డీఐఈఓలు ధనిక్ భారత్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బోర్డు నిబంధనలను ఉల్లంఘించినందుకు మీపై ఎందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోకూడదో తెలియజేస్తూ వెంటనే వివరణ సమర్పించాలని కాలేజ్ యాజమాన్యాన్ని కఠిన ఆదేశాలిచ్చింది. ఒకవేళ నిర్ణీత సమయంలో ఎలాంటి వివరణ ఇవ్వకపోతే, మీ వద్ద ఎలాంటి సమాధానం లేదని భావించి, తెలంగాణ ఇంటర్మీడియట్ విద్య మstatutory బోర్డు (TGBIE) నిబంధనల ప్రకారం తగిన చట్టపరమైన/క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించింది.  బోర్డు నిబంధనలు ఉల్లంఘించి, అనుమతులు లేకుండా కాలేజీలు నడిపితే సహించేది లేదనీ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే చర్యలు తప్పవని ప్రకటించారు. 

కాగా  రంగారెడ్డి జిల్లా పరి ధిలోని ఎల్బీనగర్, బొంగుళూరు, మాదాపూర్ ప్రాంతాల్లో ఈ కాలేజీ యాజమాన్యం బోర్డు నిబంధనలకు విరుద్ధంగా జూనియర్ కాలేజీలను నడుపుతూ అడ్మిషన్లు చేపడుతున్నట్లు.  సీజేఎస్ అధ్యక్షుడు డాక్టర్ మసారం ప్రేమ కుమార్‌   జిల్లా విద్యా అధికారులకు ఫిర్యాదు చేశారు. కనీసం ఫైర్ ఎన్ఎసీ లేకుండా తరగతులు  నిర్వహిస్తున్నారని కూడా ఫిర్యాదు చేశారు.  ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంక్యా వెంటనే వివరణ ఇవ్వాలని కాలేజీ యాజమాన్యాన్ని ఆదేశించారు.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)