Breaking News

ఎస్సై గల్లా పట్టిన వ్యక్తిపై కేసు

Published on Sun, 03/08/2026 - 10:01

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌: విధుల్లో ఉన్న ఎస్సై గల్లా పట్టి దాడి చేసిన ఘటనపై కరీంనగర్‌ పోలీసులు స్పందించారు. ఘటనపై ‘సాక్షి’లో శనివారం ‘ఖద్దర్‌నాక్‌’ శీర్షికన కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ వార్తపై డీజీపీ కార్యాలయం స్పందించింది. ఉన్నతాధికారులు శనివారం ఉదయమే సీపీ గౌస్‌ ఆలంతో ఆరా తీశారు. అనంతరం ఎల్‌ఎండీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై గల్లా పట్టుకుని చేతులతో దాడిచేస్తే, విధులకు ఆటంకం కలిగించాడని కేసు నమోదు చేయడం విడ్దూరం.

‘ఖద్దర్‌నాక్‌’

ఆ రోజు ఏం జరిగిందంటే?
తిమ్మాపూర్‌ మండలం మొగిలిపాలెంలో ఈ నెల 4వ తేదీన సాయంత్రం 6.50 గంటలకు జాతర సందర్భంగా విధుల్లో ఉన్న గన్నేరువరం ఎస్సై నరేందర్‌రెడ్డిపై చెన్నబోయిన రమేశ్‌ అనే వ్యక్తి గల్లా పట్టి దాడి చేశాడు. పోలీసులు అతడిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. పరీక్షించగా.. తాగినట్లు గుర్తించారు. అదే సమయంలో అధికార పార్టీ నేతను స్టేషన్‌కు ఎలా తీసుకెళ్తారు? అంటూ రాజకీయ ఒత్తిడి మొదలైంది. దీంతో తిమ్మాపూర్‌ సర్కిల్, సీపీ కార్యాలయం ఉన్నతాధికారులు ఈ ఘటన విషయంలో చేతులెత్తేశారు. సాక్షాత్తూ సీసీ కెమెరా ఫుటేజీ ఉన్నా.. కేసు నమోదు చేయలేదు. సాక్షాత్తూ పోలీసులపై సామాన్యుడు దాడి చేసినా ప్రతిఘటించలేని స్థితికి చేరుకున్నామని వాపోయారు.

దాడి చేస్తే.. విధులకు ఆటంకం కేసేంటి?
ఘటనను సాక్షిలో శనివారం ‘ఖద్దర్‌’నాక్‌ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఐజీ చంద్రశేఖర్‌ రెడ్డి స్పందించారు. కరీంనగర్‌ పోలీసులతో మాట్లాడారు. స్పందించిన సీపీ అదే సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేశారు. ఇది కేవలం తూతూ మంత్రపు కేసు కావడం మరో చర్చకు దారితీస్తోంది. ఎస్సై గల్లా పట్టుకుని, చేతులతో కొడితే.. ఆయనపై దాడి కేసు పెట్టకుండా కేవలం విధులకు ఆటంకం కలిగించాడని కేసు పెట్టడం.. ఉన్నతాధికారులు తలొగ్గిన తీరుకు నిదర్శనమని కిందిస్థాయి పోలీసులు విమర్శిస్తున్నారు. ఘటన జరిగినా ఉన్నతాధికారులు దాన్ని తొక్కిపెట్టడం, మీడియా ఎత్తిచూపితే తప్ప కేసు నమోదు చేసుకోలేని దయనీయ స్థితి ఎదురవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

Videos

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

DSC స్కామ్ బట్టబయలు లోకేష్ కి ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ఎంత పెరిగిందంటే..!

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)