Breaking News

హైడ్రాను చూసి బ్యాంకర్లు భయపడొద్దు

Published on Thu, 11/07/2024 - 04:42

సాక్షి, హైదరాబాద్‌: హైడ్రాను చూసి భయపడొద్దంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బ్యాంకర్లకు ధైర్యం నింపారు. హైడ్రా గురించి ఆందోళన అవసరం లేదని, హైడ్రా భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వదని స్పష్టం చేశారు. బుధవారం ప్రజాభవన్‌లో నిర్వహించిన బ్యాంకర్ల ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాలక్ష్మి పథకం మహిళలు గౌరవ మర్యాదలతో జీవించేందుకు దోహదపడుతుందన్నారు. స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలివ్వాలని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కేబినెట్‌ నిర్ణయించిందని, వీలైతే అంతకుమించి వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు.

కార్పొరేట్‌ కమర్షియల్‌ బ్యాంకులు 9 నుంచి 13 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయని, బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో పనిచేయాలన్నారు. మహిళల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వమే బస్సులు కొనుగోలు చేసి వారికి లీజుకు ఇవ్వాలని ఆలోచన సైతం చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటుచేసే సూక్ష్మ, మధ్యతర పారిశ్రామిక పార్కుల్లో మహిళలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేస్తున్నట్టు తెలిపారు. 

గిరిజన ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలకు సంబంధించి వన్‌ టైం సెటిల్‌మెంట్‌ చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, మున్సిపల్‌ పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, సెర్ప్‌ సీఈఓ దివ్యదేవరాజన్, పురపాలక సంచాలకులు, కమిషనర్‌ శ్రీదేవి పాల్గొన్నారు. 

ప్రజలపై భారం మోపకుండా 
వనరుల సమీకరణ: సామాన్య ప్రజలపై భారం మోపకుండా వనరుల సమీకరణపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. బుధవారం ప్రజాభవన్‌లో ఆదాయ వనరుల సమీ కరణపై వాణిజ్య పన్నులు, రవాణా, స్టాంపులు రిజి్రస్టేషన్లు, మైనింగ్, ఎక్సైజ్‌ శాఖల ఉన్నతాధికారు లతో భట్టి భేటీ అయ్యారు. 

సమావేశంలో భాగంగా శాఖల వారీగా సాధించిన పురోగతి వివరాలు, ఆదాయ సమీకరణ కోసం రూపొందించిన ప్రణాళి కలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా డిప్యూటీ సీఎంకు అధికారులు వివరించారు. భట్టి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే పన్ను ఎగవేతదారులపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 

ఇసుకను అందరికీ అందుబాటులో ఉంచడానికి కావలసిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుకుమార్‌ సుల్తానియా, రెవెన్యూ, వాణిజ్య పనుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సయ్యద్‌ అలీ ముర్తుజా రిజ్వీ, భూగర్భ గనుల శాఖ సెక్రటరీ సురేంద్రమోహన్, ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ శ్రీధర్, రిజిస్ట్రేషన్‌ శాఖ కమిషనర్‌ బుద్ధ ప్రకాశ్‌ పాల్గొన్నారు. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)