Breaking News

సింగిల్‌ జడ్జి తీర్పుపై స్టేకు నిరాకరణ

Published on Fri, 10/04/2024 - 06:01

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేల ఫిరాయింపుపై దాఖలైన అనర్హత పిటిషన్లలో సింగిల్‌ జడ్జి ఏదైనా ఆదేశాలు జారీ చేస్తే.. ఇక్కడ ఆశ్రయించొచ్చని స్పీకర్‌ కార్యదర్శికి సీజే ధర్మాసనం స్వేచ్ఛ ఇచ్చింది. ప్రతివాదుల వాదనలు వినకుండా సింగిల్‌ జడ్జి తీర్పును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. న్యాయ, చట్టసభ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్, కేంద్ర ఎన్నికల కమిషన్‌తోపాటు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, దానం నాగేందర్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, వివేకానంద్, వెంకట్‌రావు, కడియం శ్రీహరిలకు నోటీసులు జారీ చేసింది. 

తదుపరి విచారణలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణను అక్టోబర్‌ 24కు వాయిదా వేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నాలుగు వారాలకు గడువిస్తున్నామని.. ఆ లోగా వివరాలు అందజేయకుంటే మేమే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని గత నెల 9న స్పీకర్‌ కార్యదర్శికి హైకోర్టు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. సింగిల్‌ జడ్జి తీర్పులో ఇచ్చిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టును ఆశ్రయించారు. 

‘స్పీకర్‌ అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని కిహోటో హలోహాన్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సింగిల్‌ జడ్జి తీర్పు దీనికి విరుద్ధంగా ఉంది. మణిపూర్‌ శాసనసభ స్పీకర్‌ కీషమ్‌ మేఘచంద్ర సింగ్‌ వర్సెస్‌ స్పీకర్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై సింగిల్‌ జడ్జి ఆధారపడ్డారు. స్పీకర్‌ ఐదేళ్లపాటు మౌనంగా ఉండేందుకు ఇష్టపడితే కోర్టులు చూస్తూ ఉండలేవని చెప్పారు. 

బీఆర్‌ఎస్‌ కాలంలో అనేక అనర్హత పిటిషన్లు పదవీకాలం ముగిసే వరకు పెండింగ్‌లోనే ఉన్నాయి. పిటిషనర్లు స్పీకర్‌ను ఊపిరి తీసుకునే అవకాశమైనా ఇవ్వకుండా కోర్టును ఆశ్రయించారు’అని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయ సమీక్ష అధికారాలతో అనర్హత పిటిషన్‌లను నిర్ణీత గడువులోగా నిర్ణయించాలని శాసనసభ స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయగలదో.. లేదో తేల్చాలని కోరారు. 

ఈ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. సింగిల్‌ జడ్జి ఇచ్చిన గడువు సమీపిస్తోందని, ఏదైనా నిర్ణయం వెలువరించే అవకాశముందని చెప్పారు. సింగిల్‌ జడ్జి సుమోటోగా విచారణ చేపట్టకున్నా.. బీఆర్‌ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఈ నేపథ్యంలో సింగిల్‌ జడ్జి ఆదేశాలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఒకవేళ ఏదైనా ఉత్తర్వులు ఇస్తే వెంటనే ఇక్కడ (సీజే ధర్మాసనం) ఆశ్రయించే స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. దీనికి అనుమతించిన ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, విచారణ వాయిదా వేసింది.  

సింగిల్‌ జడ్జి తీర్పు ఇది... 
ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావును అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వివేకానంద్, దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా, స్పీకర్‌ సమయం ఇవ్వడం లేదంటూ బీజేపీ ఎల్పీ మహేశ్వర్‌రెడ్డి వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. 

ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి.. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై దాఖలైన అనర్హత పిటిషన్ల స్టేటస్‌ చెప్పేందుకు నాలుగు వారాలకు గడువిస్తున్నాం.. ఆలోగా వివరాలు అందజేయకుంటే మేమే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని గత నెల 9న స్పీకర్‌ కార్యదర్శికి హైకోర్టు తేల్చి చెప్పింది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)