Breaking News

ఫిక్స్‌డ్‌ వేతనం రూ.18 వేలు ఇవ్వాలి 

Published on Tue, 09/12/2023 - 06:35

సుల్తాన్‌ బజార్‌: ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఆశ వర్కర్లకు ఫిక్స్‌డ్‌ వేతనం రూ.18 వేలు ఇవ్వాలని తెలంగాణ ఆశవర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి డిమాండ్‌ చేశారు. సోమవారం తెలంగాణ ఆశవర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కోఠిలోని డీఎంహెచ్‌ఎస్‌ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వేలాదిగా ఆశవర్కర్లు తరలివచ్చారు.

ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ తామంతా సుశిక్షితులమని, ఎప్పటి కప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజాసేవ చేస్తున్నామని చెప్పారు. రోగుల సర్వే చేయడం, బీపీ, షుగర్, థైరాయిడ్, అన్ని రకాల జబ్బులు గుర్తించి మందులను రోగులకు సరఫరా చేస్తున్నామన్నారు. కరోనా నియంత్రించడంలో ఆశావర్కర్లు కీలక పాత్ర పోషించారని, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశావర్కర్లకు హెల్త్‌ గ్లోబల్‌ లీడర్స్‌ అవార్డును కూడా ప్రకటించిందని గుర్తు చేశారు.

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు సబ్‌ సెంటర్స్, దవాఖానాల్లో పనిచేయాలని ప్రభుత్వం చెబుతోందని, అయినా తమకు కేవలం రూ.9.750 వేలు మాత్రమే పారితోషకమే ఇస్తోందన్నారు. ఒకవైపు పనిభారంతో, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.

వేతనం రూ.18 వేలకు పెంచాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఆశావర్కర్లకు హెల్త్‌ కార్డులు, ప్రమాద బీమా రూ.5 లక్షలు ఇవ్వాలని, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం పోస్టుల్లో ఆశావర్కర్లకు పదోన్నతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.నీలాదేవి తదితరులు పాల్గొన్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)