Breaking News

11 గంటలు .. 14 ప్రశ్నలు.. కవిత సమాధానాలు పూర్తిగా వీడియో రికార్డింగ్‌ 

Published on Tue, 03/21/2023 - 07:36

సాక్షి, న్యూఢిల్లీ:  ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సోమవారం దాదాపు 11 గంటల పాటు ఎమ్మెల్సీ కవితను విచారించిన ఈడీ అధికారులు.. 14 ప్రశ్నలు అడిగారని తెలిసింది. విచా రణ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయాలంటూ కవిత చేసిన విజ్ఞప్తి మేరకు.. అధికారులు విచారణను పూర్తిగా వీడియో రికార్డింగ్‌ చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ఒత్తిడిలో భాగంగానే విచారణకు పిలిచారని ఈడీ అధికారులతో కవిత అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఇది కేవలం రాజకీయ కుట్ర అని స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిడితో ఈడీలో పారదర్శకత లోపించిందని చెప్పారు.

‘ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో నన్ను నిందితురాలిగా పిలిచారా?’ అని ప్రశ్నించారు. ‘కాదు..’ అని అధికారులు సమాధానం ఇచ్చారని తెలిసింది. సుప్రీంకోర్టులో పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగా ఇంత తొందరగా విచారించాల్సిన అవసరం ఏముందని కవిత ప్రశ్నించారని సమాచారం. అలాగే తను ఫోన్‌ ధ్వంసం చేసినట్టు మీడియాకు లీకులెవరిచ్చారని కూడా కవిత ప్రశ్నించారు. గత విచారణలో స్వా«దీనం చేసుకున్న తన ఫోన్‌ పూర్తిగా చెక్‌ చేసుకోవచ్చని అన్నారు. పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే అధికారులు విచారిస్తున్నారని, అయినా విచారణకు తాను పూర్తిగా సహకరిస్తున్నానని చెప్పారు. కాగా సోమవారం కవిత ఈడీ కార్యాలయానికి చేరుకున్న గంట తర్వాత అధికారులు వచ్చారని, చాలాసేపు కవిత ఒక్కరినే రూమ్‌ కూర్చోబెట్టారని సమాచారం.
చదవండి: హస్తినలో హైటెన్షన్‌

Videos

అల్లు అర్జున్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ..?

నేను నిప్పు, తెరిచిన పుస్తకం అన్నావ్ గా.. మరీ ఈ సీక్రెట్ టూర్ లు ఏంటి?

ఫ్రెండ్స్ తో పందెం కట్టి.. పెన్ను మింగేశాడు

ఈ వయసులో నీకు బుద్ధి లేదా.. MLA బుచ్చయ్య చౌదరిపై రెచ్చిపోయిన చెల్లుబోయిన

స్విట్జర్లాండ్ లో పెను విషాదం.. 40 మంది మృతి ..100 మందికి గాయాలు

చంద్రబాబు మీద ఉన్న ప్రతి కేసు రీ ఓపెన్!

బుజ్జితల్లి టాలీవుడ్ కు వచ్చేస్తుందా..

ప్రేమపెళ్లి చేసుకున్న యువకుడిపై దాడి

800 KG కేక్ కట్టింగ్.. జగన్ ఆశీస్సులతో మనదే విజయం

జగన్ వార్నింగ్ తో చంద్రబాబు సెల్ఫ్ గోల్..

Photos

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

‘ఈషా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

లంగా ఓణీలో 'ఈషా రెబ్బా'.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

హైటెక్ సిటీలో ఉత్సాహంగా న్యూ ఇయర్ వేడుకలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు (ఫొటోలు)